తెరపై '7/G బృందావన కాలనీ' హీరోయిన్ జీవితం
'7/G బృందావన కాలనీ' చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన హీరోయిన్ సోని అగర్వాల్. ఆ తర్వాత దర్శకుడు సెల్వరాఘవన్‌ను పెళ్లి చేసుకుని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆమె జీవితంలోని కొన్ని సంఘటనలతో తమిళంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రంలో ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసారు. చిత్రం టైటిల్ ఒరు నడిగైయిన్ వాగ్మూలం. హీరోయిన్ జీవిత ఇతివృత్తంతో ఇది తెరకెక్కుతోంది. హీరోయిన్లు ఎలాంటి ఇబ్బం దులకు గురవుతారు, కుటుంబ ఒత్తిళ్లు తదితర అంశాలతో తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు రాజ్‌కృష్ణ తెలిపారు.
ఇందులోని హీరోయిన్ పాత్రలో తన జీవితానికి సంబంధించిన కొన్ని ఘటనలు ఉన్నాయని నటి సోనీ అగర్వాల్ చెప్పారు. అంతేగాని చిత్రమంతా తన కథతో తెరకెక్కడం లేదని ఆమె పేర్కొన్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటిస్తున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్‌ను పెళ్లి చేసుకుని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న ఈమె ఒరు నడిగైయిన్ వాగ్మూలం చిత్రంలో నటించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. గతంలో అరిందుమ్ అరియామలుమ్, కుండక మండక, పట్టియల్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన పున్నగై గీత ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చిందని రాజాకృష్ణ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











