క్రిష్ దర్శకత్వంలో సెల్వ రాఘవన్ మాజీ భార్య
ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ మాజీ బార్య సోనీ అగర్వాల్ ఇప్పుడు తమిళంలో అవకాశాలు కోసం సినిమా ఆఫీసులు చుట్టూ తిరుగుతోంది. సెవెన్ బై జీ బృందావన కాలనీ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ఈమె క్రిష్ కంట్లో పడింది. క్రిష్ తాజాగా తెలుగులో తీసిన వేదం చిత్రం రీమేక్ ని తమిళంలో తెరకెక్కుస్తున్నారు. 'వానమ్' టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ ప్రధానమైన పాత్రకి ఆమెను తీసుకున్నారు. తెలుగులో ఈ పాత్రను నేనింతే ఫేమ్ శియ గౌతమ్ చేసింది. ముస్లింగా చేసిన మనోజ్ బాజపేయ్ పాత్రకు భార్యగా ఉండే పాత్ర అది. ఇక మనోజ్ బాజపేయి పాత్రను తమిళంలో ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ చేసిన కేబుల్ రాజు పాత్రని..శింబు, మనోజ్ పాత్రను మనోజే చేస్తున్నారు. ఇక అనూష్క వేశ్యగా కంటిన్యూ అవుతోంది. ఇక సోనియా ఈ అవకాశం గురించి మాట్లాడుతూ "కథలో నేనేమీ ప్రధాన పాత్రధారిని కాదు. ప్రకాష్‌రాజ్ భార్యగా కనిపిస్తాను. నాలుగైదు ముఖ్య సన్నివేశాలుంటాయి. ఓ పాట కూడా ఉంది" అని చెప్పింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











