సోనియా అగర్వాల్ పున: ప్రవేశం
సోనియా అగర్వాల్ కెరీర్ ను క్షుణంగా పరిశీలిస్తే డింపుల్ కపాడియా గుర్తుకొస్తుంది. 'బాబీ" సినిమాలో తన సౌందర్యలాతో అప్పట్లో ప్రేక్షకును పిచ్చెక్కించిన డింపుల్ను అప్పటి సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రాజేష్ ఖన్నా పెళ్ళి చేసుకుని సినిమా జీవితానికి అడ్డుకట్టవేయడం, ఇద్దరు పిల్లల తల్లైన తర్వాత విడిచిపెట్టడం జరిగింది. తర్వాత మళ్లీ 'సాగర్" సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే సోనియా విషయంలోనూ ప్రస్తుతం అదే జరగబోతున్నది. కానీ సోనియాను పెళ్లి చేసుకున్నది హీరో కాకుండా దర్శకుడు కావడం ఒక్కటే వ్యత్యాసం. సోనియాను రెండు చిత్రాల్లో దర్శకత్వం చేసిన సెల్వరాఘవన్, ఆమెను వివాహం చేసుకొని సినిమాల్లో నటించడం ఆపేశాడు. నాలుగు సంవత్సరాల కుటుంబంతో జీవనం సాగించిన సోనియా భార్య, భర్త అభిప్రాయబేధాలు అనే వంకతో ఆమెకు విడాకులు ఇచ్చేస్తున్నాడు. దాంతో కలత చెందిన అగర్వాల్ కొంత విరామంతో ప్రెష్ మైండ్ తో, తన పూర్వ అనుభంతో మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ఉత్సుకత చూపుతోంది. 'మాణిక్యం-420" '7జి బృందావన్‌కాలని" మొదలైన చిత్రాల్లో నటించినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే వున్న సోనియా సెకండ్ ఎంట్రీలోనూ తన పెర్ ఫామెన్స్ ను చూపడం ఖాయమని ఆమె అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











