రజనీకాంత్ లేటెస్ట్ చిత్రంలో అతన్నే విలన్ గా బుక్ చేసారు
రజనీకాంత్ తాజా చిత్రం రానా లో సోనూసూద్ ని విలన్ గా బుక్ చేసినట్లు సమాచారం. రజనీకాంత్ రీసెంట్ గా సోనూసూద్ అధ్బుతంగా నటించిన దబాంగ్, అరుంధతి చిత్రాలు చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమయ్యే చిత్రం కాబోతుందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపికా పదుకోణి ని తీసుకున్నారు. అలాగే సంగీతం ఎప్పటిలాగే ఎ.ఆర్.రహమాన్ అందిస్తున్నారు. హైయిస్ట్ పెయిడ్ సాంకేతికనిపుణులు ఈ చిత్రానికి పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని యూరోస్ ఇంటర్నేషనల్ వారు ఓచర్ స్టూడియోస్ తో కలిసి నిర్మించనున్నారు.ఈ చిత్రం ఓ పీరియడ్ డ్రామా గా చెప్తున్నారు. ఇక సోనూసూద్ ..అమితాబ్ సరసన..పూరి జగన్నాధ్ చిత్రం బుడ్డ లో నటించటానికి కమిటయ్యారు.


Click it and Unblock the Notifications











