చుట్టూ ఆంక్షలు, అలా డేటింగ్ చేశాం, ధనుష్ హెల్ప్ చేశాడు: సౌందర్య రజనీకాంత్-విశాగన్

మొదటి భర్తతో విడిపోయిన రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య ఫిబ్రవరి 11న విశాగన్ వనంగమూడి అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి వైవాహిక జీవితం హ్యాపీగా ముందుకు సాగుతోంది. పెళ్లి జరుగడానికి ముందు ఇద్దరూ 5 నెలలు డేటింగ్ చేశారు.

ఈ జంట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ రిలేషన్ షిప్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమది పెద్దలు కుదర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ అని, తమ చుట్టూ చాలా ఆంక్షలు ఉండటంతో పెళ్లికి ముందు డేటింగ్ ఎక్కువగా చాటింగ్ రూపంలోనే జరిగిందని తెలిపారు.

ఆ సమయంలో సౌందర్య సిద్దంగా లేదట

ఆ సమయంలో సౌందర్య సిద్దంగా లేదట

‘‘తిరునావుక్కరసర్ అంకుల్(కాంగ్రెస్ లీడర్) విశాగన్ గురించి, వారి ఫ్యామిలీ గురించి మా నాన్నకు చెప్పడంతో ఆయన కన్విన్స్ అయ్యారు. ఆ సమయంలో నేను మరో కమిట్మెంటు(పెళ్లి)కి సిద్ధంగా లేను. అతడిని కలిసిన తర్వాత నా నిర్ణయం చెబుతానన్నాను. తొలిసారి మేము ఒక కేఫ్‌లో కలిశాం'' అని సౌందర్య తెలిపారు.

ఐశ్వర్య-ధనుష్‌లను కలవాలని చెప్పిందట

ఐశ్వర్య-ధనుష్‌లను కలవాలని చెప్పిందట

తొలిసారి ఆమెను కలిసినపుడు కాస్త నర్వస్ ఫీలయ్యాను, ఆమెను కలిసిన తర్వాత నాకు సూటవుతుందని డిసైడ్ అయినట్లు విశాగన్ వెల్లడించారు. సౌందర్యకు కూడా అతడు నచ్చంతో ఒకసారి తన సోదరి ఐశ్వర్య, బావ ధనుష్‌ను కలవమని చెప్పిందట. వారు కూడా ఒకే చేస్తే ఫైనల్ డెసిషన్ తీసుకుంటానని చెప్పిందట.

ధనుష్ హెల్ప్ చేశాడు

ధనుష్ హెల్ప్ చేశాడు

‘మేమిద్దరం కూడా ప్రాక్టికల్, రియలిస్టిక్ మనుషులం. ధనుష్-ఐశ్వర్యను కలవాలని చెప్పగానే నాకు రైట్ అనిపించింది. రజనీకాంత్ సర్‌కు మా నిర్ణయం చెప్పేముందు ఇది సరైందే అనిపించింది. ధనుష్‌ను కలిసే ముందు నర్వస్ ఫీలయ్యాను. మా విషయంలో ఆయన సంతోషం వ్యక్తం చేయడం కూల్ అయ్యాను. మా నిర్ణయాన్ని రజనీ సర్‌కు చెప్పడంలో ధనుష్ హెల్ప్ చేశాడు' అని విశాగన్ గుర్తు చేసుకున్నారు.

సౌందర్య-విశాగన్

సౌందర్య-విశాగన్

సౌందర్య, విశాగన్ వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి 11న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌కు కోలీవుడ్ చిత్ర సీమతో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X