రజనీ కూతురు సౌందర్య షేర్ చేసిన ఫోటోపై విమర్శలు, క్షమాపణలు!

సినిమా రంగానికి చెందిన ఫిమేల్ సెలబ్రిల మీద సాంప్రదాయ వాదం, కల్చర్ పేరు ఈ మధ్య కొందరు నెటిజన్లు అభ్యంతరక కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్స్ ఇలాంటి దాడులకు గురవ్వగా తాజాగా రజనీకాంత్ కూతురు సౌందర్యకు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే ఆమెపై నెగెటివ్ కామెంట్లకు కారణం ఆమె వేసుకున్న డ్రెస్సు కాదు.

సౌందర్య ఇటీవల తన కుమారుడితో కలిసి దిగిన ఓ లవ్లీ ఫోటోను షేర్ చేశారు. అయితే ఇందులో ఆమె స్విమ్ ధరించి కొడుకుతో కలిసి ఈత కొలనులో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇక్కడ విమర్శలకు కారణం ఆమె జలకాలాడటమే.

చెన్నైలో నీటి కరువు

చెన్నైలో నీటి కరువు

చెన్నై నగరం తీవ్రమైన నీటి కరువుతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. పరిస్థితి ఎంత దారుణం ఉందంటే డబ్బులు పెట్టి కొందామన్నా నీరు దొరకని పరిస్థితి. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు అందజేస్తోంది. నీటి కటకట కారణంగా చాలా హోటల్స్ తాత్కాలికంగా మూతపడ్డాయి. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు కనీసం త్రాగు నీరు కూడా సమకూర్చలేక వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఇచ్చాయి.

అందుకే నెటిజన్ల ఆగ్రహం

అందుకే నెటిజన్ల ఆగ్రహం

చెన్నైలో నీటి చుక్క దొరకడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో... రజనీకాంత్ కూతురు ఇలా నీటిని వృధా చేయడం చాలా మందికి కోపం తెప్పించింది. దీంతో ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఓ వైపు నీటిని సేవ్ చేయాలనే ఉద్యమం జరుగుతుంటే... రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్ కూతురు అయి ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఏం బాగోలేదని మండి పడ్డారు.

క్షమాపణలు చెప్పిన సౌందర్య

క్షమాపణలు చెప్పిన సౌందర్య

తన ఫోటోపై విమర్శలు రావడంతో సౌందర్య వెంటనే తన ట్రావెల్ డైరీ నుంచి ఆ ఫోటోను తొలగించింది. క్షమాపణలు చెప్పింది. అది ఇప్పటి ఫోటో కాదని, పాత ఫోటో అని వెల్లడించారు. చిన్నతనం నుంచే పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతో తాను ఈ ఫోటో షేర్ చేసినట్లు తెలిపారు.

గతంలోనూ హనీమూన్ ఫోటోలు షేర్ చేసి విమర్శల పాలైంది

గతంలోనూ హనీమూన్ ఫోటోలు షేర్ చేసి విమర్శల పాలైంది

కొన్ని రోజుల క్రితం సైతం సౌందర్య తన హనీమూన్ ఫోటోలు షేర్ చేసి విమర్శల పాలయ్యారు. పూల్వామా దాడిలో దాదాపు 49 మంది సీఆర్ఫీఎఫ్ జనాన్లు మరణించి దేశం మొత్తం విషాదంలో ఉండగా సౌందర్య తన హనీమూన్ ఫోటోలు షేర్ చేసి విమర్శల పాలయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X