'కథానాయకుడు'లో రజనీ కూతురు...

By Staff

Soundarya
సూపర్ స్టార్ రజనీ కాంత్, పి. వాసు కాంబినేషన్‌లో వస్తున్న 'కథానాయకుడు' (తమిళంలో "కుచేలన్") చిత్రం ఈ నెల 31 న 1500 ప్రింట్లతో విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాలో రజనీ కుమార్తె సౌందర్య రజనీ కాంత్ నటించనుందట. అయితే సాంగ్ సీక్వెన్స్‌లో కొద్ది సెకన్ల పాటు అలా కనిపించి మాయమై పోతుందిట. గతంలో ఆమె శంకర్ వంటి పెద్ద పెద్ద దర్శకుల ఆపర్స్ నే తిరస్కరించింది. అయితే పి.వాసు ఆమెను కలిసి పాట సంధర్భం 75 యేళ్ళ సినిమా చరిత్రను చెప్పేదని ఒప్పించాడు.దాంతో ఆమె సినిమా...సినిమా పాట చరణం ఎత్తుకుంటుంది.

ఇకపోతే ఎ.ఆర్. రహమాన్ మేనల్లుడు జి.వి. ప్రకాష్ సమకూర్చిన సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల టాక్. 'దశావతారం'లో పద్మభూషణ్ కమల్‌హాసన్ పది గెటప్‌లతో సినీ పరిశ్రమను కుదిపేస్తుంటే, "కథానాయకుడు"లో రజనీ కాంత్ 20 గెటప్‌లతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ చిత్రం మిక్సింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న పి.వాసును ఈ మధ్య మీడియా కలిసి "కుచేలన్" తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ ఎప్పుడు అని అడిగితే.. రజనీ సార్‌తో మళ్ళీ సినిమా చేస్తున్నమాట నిజమే... కానీ అది ఎప్పుడనేది ఇంకా చెప్పలేను.

ఈ నెలలో కుచేలన్ విడుదల, ఆగస్టులో "రోబో" షూటింగ్ ప్రారంభమౌతోంది. ఆ తర్వాత రజనీ కుమార్తె సౌందర్య రూపొందిస్తున్న "సుల్తాన్ ది వారియర్" విడుదల, వీటి గ్యాప్‌లోనా? లేక వీటి తర్వాత అనేది ఆయనే నిర్ణయించాలని చెప్పారు. అయితే కుచేలన్ రష్ చూశాక రజనీ సార్ తనను అభినందించారని పి. వాసు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పి. వాసు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో, అనేక మంది సినీ తారలు, టెక్నీషియన్లు, డిస్టిబ్యూటర్లు ఇలా కనిపించి అలా తమ అభిమానులకు కనువిందు చేస్తారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X