రజనీకాంత్ కూతురు రెండో వివాహం.. తల్లి షాకింగ్ నిర్ణయం.. పోలీసులకు లేఖ

సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ రెండోసారి పెళ్లికూతురు కాబోతున్నది. నటుడు, వ్యాపారవేత్త విషాగన్ వనంగముడిని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు చెన్నైలోని విలాసవంతమైన కాలనీ తేనంపేట్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

మొదటి పెళ్లికి కోర్టు ద్వారా విడాకులు

మొదటి పెళ్లికి కోర్టు ద్వారా విడాకులు

గతంలో సౌందర్య రజనీకాంత్ ప్రముఖ పారిశ్రామిక వేత్త అశ్విన్ రాంకుమార్‌ను వివాహం చేసుకొన్నది. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వారిద్దరూ కోర్టు ద్వారా విడాకులు పొందారు. వారి పరస్పర అవగాహన మేరకు వారికి 2016లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. మొదటి వివాహం ద్వారా సౌందర్య రాజన్‌కు వేద్ కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు.

విషాగన్ వనంగముడితో ప్రేమలో

విషాగన్ వనంగముడితో ప్రేమలో

అశ్విన్‌తో విడాకులు పొందిన తర్వాత సౌందర్యకు విషాగన్ వనంగముడి మధ్య ప్రేమ వ్యవహారం బలపడింది. దాంతో ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్టు సమాచారం. విషాగన్ వనంగముడి వంజగర్ ఉలగం అనే సినిమాలో నటించాడు. కాకపోతే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.

చెన్నై పోలీసులకు లతా రజనీకాంత్ లేఖ

చెన్నై పోలీసులకు లతా రజనీకాంత్ లేఖ

విషాగన్, సౌందర్య రజనీకాంత్ పెళ్లి నేపథ్యంలో తల్లి లతా రజనీకాంత్ చెన్నై పోలీసులకు లేఖ రాశారు. వివాహం జరిగే పోయెస్ గార్డన్‌లోని మా నివాసం వద్ద పోలీసుల రక్షణ ఏర్పాటు చేయాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. అలాగే రిసెప్షన్ జరిగే వేదిక వద్ద కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని అభ్యర్థించారు.

ఫ్యాన్స్‌కు రజనీకాంత్ పిలుపు

ఫ్యాన్స్‌కు రజనీకాంత్ పిలుపు

తన కూతురు సౌందర్య రజనీకాంత్ వివాహాన్ని ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అభిమానులు తరలి రావొద్దని అభిమాన సంఘాలకు స్వయంగా రజనీకాంత్ సూచించినట్టు కథనం వెలువడింది. ఫ్యాన్స్ రావడం వల్ల ట్రాఫిక్ జామ్, ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున్న కొంత సహనాన్ని పాటించాలని రజనీ అభిమాన సంఘాల నేతలతో పేర్కొన్నట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X