సూపర్ స్టార్ అల్లుడికి చెప్పుకోలేని కష్టం.. ఊహించని సంఘటనతో షాక్!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు విశాగన్‌కి ఊహించని షాక్ తగిలింది. ఊహించని రీతిలో ఆయన పాస్‌పోర్ట్, డబ్బులు చోరీకి గురయ్యాయి. లండన్‌లోని హెబ్రూ ఎయిర్ పోర్ట్ లో ఈ సంఘటన జరిగింది. దీంతో అక్కడి పోలీసు యంత్రాంగం విశాగన్‌కి సహకారం అందించారని సమాచారం. ఇంతకీ ఈ ఉదంతం ఎలా జరిగింది? పాస్‌పోర్ట్ దొంగిలించింది ఎవరు? వివరాల్లోకి పోతే..

సౌందర్య రజినీకాంత్ తో విశాగన్ వివాహం
రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్‌ని ఈ ఏడాది ఫిబ్రవరి 11న విశాగన్ వివాహమాడిన సంగతి తెలిసిందే. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో రజినీకాంత్ కుటుంబం సహా పలువురు ప్రముఖుల నడుమ వీరి వివాహం జరిగింది. విశాగన్ ప్రముఖ వ్యాపార వేత్తగా దేశ విదేశాల్లో వ్యాపారం కొనసాగిస్తుంటారు.

ఇద్దరిదీ రెండో వివాహమే..
ఇటు సౌందర్య రజినీకాంత్, అటు విశాగన్ ఇద్దరికీ ఇది రెండో వివాహమే. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సౌందర్య రజినీకాంత్‌ని పెళ్లాడాడు విశాగన్. మరోవైపు సౌందర్య కూడా మొదట అశ్విన్ రామ్‌కుమార్ అనే వ్యక్తిని పెళ్ళాడి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయనతో విడాకులు తీసుకుంది. దీంతో పెద్దల సమక్షంలో సౌందర్య రజినీకాంత్, విశాగన్ వివాహం జరిగింది.

భార్యతో లండన్ వెళ్తుండగా.. అనుకోని సంఘటన
భార్య సౌందర్యతో కలిసి లండన్ వెళ్లేందుకు సిద్దమయ్యాడు విశాగన్. బుధవారం సాయంత్రం ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్‌లో చెన్నై నుంచి లండన్ బయల్దేరిన ఆయన.. అక్కడి హెబ్రూ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. అయితే విమానం దిగుతుండగానే ఆయన బ్రీఫ్‌కేస్ చోరీకి గురైంది. అందులో పాస్‌పోర్ట్‌తో పాటు అమెరికన్ డాలర్లు కూడా ఉన్నాయట.

ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం
దీంతో విశాగన్ ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఆ దంపతులను ఓ గెస్ట్ రూమ్ అలాట్ చేసిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది భారత దౌత్యాధికారులకు సమాచారం అందించారు. దీంతో వారికి టెంపరరీ పాస్‌పోర్ట్‌ను జారీ చేశారని తెలిసింది. ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











