రజనీకాంత్ కూతురు రెండో వివాహం.. వరుడు ఎవరో తెలుసా!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. రజనీకాంత్ కూతురు, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. తన మొదటి భర్త నుంచి సౌందర్య రజనీకాంత్ విడాకులు పొందిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే పెళ్లి వార్త విషయం సూపర్‌స్టార్ సన్నిహితులకు, కుటుంబ సభ్యులకే తెలిసింది. తాజాగా బయటకు పొక్కడంతో మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే..

సౌందర్య రజనీకాంత్ తొలి వివాహం
సౌందర్య రజనీకాంత్ వివాహం 2010 జూలైలో పారిశ్రామిక వేత్త అశ్వినీ కుమార్‌తో జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే వ్యక్తిగత అభిప్రాయ బేధాలు తలెత్తాయి. దాంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. వీరిద్దరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. 2017లో అశ్విన్ నుంచి సౌందర్య రజనీకాంత్ విడాకులు పొందారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు.

సౌందర్య రజనీకాంత్ రెండో పెళ్లి
అశ్విన్‌తో విడాకులు పొందిన తర్వాత సౌందర్య రజనీకాంత్ ప్రస్తుతం వ్యాపార వేత్త విషాగన్ వనంగముడితో ప్రేమలో ఉన్నారు. ఇటీవలే విషాగన్, సౌందర్య రజనీకాంత్‌కు నిశ్చిత్తార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్టు సమాచారం అని రీతూ గుప్తా అనే సెలబ్రిటీ ట్వీట్ చేశారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారుడితో
సౌందర్య రజనీకాంత్ కాబోయే భర్త విషాగన్ వనంగముడి ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీకి యజమాని. తమిళనాడులోని ప్రముఖ పారిశ్రామిక వేతత్త వనంగముడి కుమారుడు. ప్రతిష్టాత్మక కుటుంబంలోని వ్యక్తిని సౌందర్య రజనీకాంత్ భాగస్వామిగా ఎంచుకోబోతున్నారు. అంతా సవ్యంగా జరిగితే జనవరి 2019లో వివాహం జరిగే అవకాశం ఉంది.

విషాగన్‌కు కోలీవుడ్‌తో రిలేషన్
విషాగన్ కూడా తమిళ చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉంది. దర్శకుడు మనోజ్ బీద రూపొందించిన వంజగర్ ఉల్గమ్ అనే సినిమాతో హీరోగా తమిళ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. సింగప్పు రోజాక్కల్ 2 అనే చిత్రంలో హీరోగా నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదు.

దర్శకురాలిగా సౌందర్య రజనీకాంత్
ఇక సౌందర్య కెరీర్ విషయానికి వస్తే.. తమిళ పరిశ్రమలో దర్శకురాలిగా సుపరిచితులు. తండ్రి రజనీకాంత్‌తో కొచ్చడయాన్ అనే చిత్రాన్ని రూపొందించారు. భారత్‌లోనే తొలిసారి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. రజనీ సరసన దీపికా పదుకొన్ నటించింది. ఆ తర్వాత వీఐపీ2 అనే చిత్రాన్ని ధనుష్‌తో రూపొందించిన సంగతి తెలిసిందే.

సౌందర్య రజనీకాంత్ పెళ్లి వార్త వైరల్
కాగా సౌందర్య రజనీకాంత్ పెళ్లి వార్త ప్రస్తుతం మీడియాలో వైరల్ అయింది. అయితే అటు సౌందర్య కుటుంబ సభ్యులు గానీ, ఇటు విషాగన్ తరఫు వాళ్లుగానీ ఈ వార్తలపై స్పందించలేదు. అధికారికంగా ఈ పెళ్లిపై స్పందిస్తే తప్ప ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











