వి ఆర్ వన్ అంటూ పెళ్లి తర్వాత.. కొడుకు పేరు కలిసేలా సౌందర్య రజినీకాంత్ ట్వీట్!

సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ రెండో వివాహం నేడు చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, విశాగన్ బంధువులు, మిత్రుల సమక్షంలో ఓ స్టార్ హోటల్‌లో ఈ వివాహం జరిగింది. వైభవంగా జరిగిన వివాహంతో సౌందర్య రజనీకాంత్, విశాగన్ ఒక్కటయ్యారు. విశాగన్ అటు ఫార్మా కంపెనీ అధినేతగా, ఇటు నటుడిగా రాణిస్తున్నాడు. ఇక సౌందర్య రజని కుమార్తెగా సినిమాల్లో రంగంలో గ్రాఫిక్ డిజైనర్ గా మంచి ప్రావీణ్యమే సంపాదించింది. వివాహం జరిగిన వెంటనే సౌందర్య సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.

ఘనంగా వివాహం

ఘనంగా వివాహం

వివాహానికి ముందు శుక్రవారం రోజు రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. కాగా నేడు జరిగిన వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, అనిరుద్ రవిచందర్, మంజిమ మోహన్, దిగ్గజ నటుడు కమల్ హాసన్ లాంటి ప్రముఖ సెలెబ్రిటీలంతా హాజరయ్యారు. హీరోయిన్ ఆండ్రియా, సీనియర్ నటి ఖుష్బూ, రాఘవలారెన్స్ వివాహానికి హాజరై వధూవరులని ఆశీర్వదించారు.

కొడుకు పేరు కలిసేలా

వివాహం పూర్తి కాగానే సౌందర్య రజనీకాంత్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. విశాగన్ తనకు తాళిబొట్టు కడుతున్న ఫొటో, తండ్రి రజనీకాంత్ తో ఉన్న ఫోటో, తన కొడుకు వేద్ తో ఉన్న ఫోటోని సౌందర్య రజనీకాంత్ పోస్ట్ చేశారు. మేము ఒక్కటయ్యాం అని కామెంట్ పెట్టారు. తన కొడుకు వేద్, భర్త విశాగన్ తో పాటు తన పేరు ఉండేలా వేద్ విశాగన్ సౌందర్య అనే హ్యాష్ట్యాగ్ ని సౌందర్య జత చేశారు. సౌందర్య పెళ్లి ఫొటోలో నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.

రెండో వివాహం

రెండో వివాహం

సౌందర్య రజనీకాంత్ కు ఇది రెండవ వివాహం. తన మాజీ భర్త అశ్విన్ నుంచి సౌందర్య 2017లో విడిపోయింది. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. మరోవైపు విశాగన్ కి కూడా ఇది రెండవ వివాహమే.సౌందర్య రజనీకాంత్ గ్రాఫిక్ డిజైనర్ గా మాత్రమే కాక దర్శకురాలిగా విక్రమ సింహ చిత్రాన్ని తెరకెక్కించారు. విశాగన్ తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణిస్తున్నాడు.

 వాళ్లద్దరికి ప్రత్యేకంగా

వాళ్లద్దరికి ప్రత్యేకంగా

సౌందర్య రజనీకాంత్ మరో స్పెషల్ ట్వీట్ కూడా చేసింది. పెళ్లి కుమార్తెగా తనని అలంకరించిన మేకప్ మరియు హెయిర్ స్టైలిస్ట్ ప్రకృతి, కియారాలకు సౌందర్య కృతజ్ఞతలు తెలిపింది. వారిద్దరితో ఉన్న ఫోటోని సౌందర్య ట్విట్టర్ లో షేర్ చేసింది. మొత్తంగా సౌందర్య రజనీకాంత్, విశాగన్ ఈ వివాహ వేడుకతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సంగీత దర్శకుడు అనిరుద్ ఫోటోని కూడా షేర్ చేస్తూ లవ్ యు బ్రదర్ అని సౌందర్య ట్వీట్ చేయడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X