రజనీ ఇంట్లో సందడి, ధనుష్ కూడా జాయిన్ అవ్వడంతో ఫుల్‌జోష్ (ఫోటోస్)
సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు వేద్ కృష్ణ మూడో పుట్టినరోజు వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో రజనీ భార్య, ఇద్దరు కూతుళ్లతో పాటు హీరో ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సౌందర్య ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. భర్తతో విడిపోయిన సౌందర్య ప్రస్తుతం తన పుట్టింట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. సౌందర్య సినిమా రంగాన్ని తన కెరీర్‌గా ఎంచుకుని దర్శకురాలిగా ముందుకు సాగుతున్నారు. ధనుష్‌తో ఆమె 'విఐపి2' చిత్రాన్ని తెరకెక్కించారు.
కొడుకే తన సర్వస్వంగా...
మూడేళ్ల క్రితం నా జీవితంలోకి ఏంజెల్ వచ్చాడు.... అంటూ సౌందర్య ట్విట్టర్లో తన బేబీ బాయ్ గురించి ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.
మనవడి పుట్టినరోజు వేడుకలో రజనీకాంత్
మనవడు వేద్ కృష్ణ పుట్టినరోజు వేడుకలో రజనీకాంత్. రజనీకాంత్ ఫ్యామిలీ నుండి హీరోలు లేరు. భవిష్యత్తులో వేద్ కృష్ణ సినిమా హీరోగా మారే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
వేద్ కృష్ణతో ధనుష్
వేద్ కృష్ణ పుట్టినరోజు వేడుకలో హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు.

అనిరుధ్ రవిచందర్
రజనీకాంత్ ఫ్యామిలీతో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌కు మంచి అనుబంధం ఉంది. వేద్ కృష్ణ పుట్టినరోజు వేడుకలో అనిరుధ్ కూడా పాల్గొనడమే ఇందుకు నిదర్శనం.


Click it and Unblock the Notifications











