సౌందర్య రజనీకాంత్‌కు చేదు అనుభవం.. బుర్ర ఉందా? ఆ ఫోటోలు షేర్ చేస్తావా?..
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, తమిళ దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ వివాహం తర్వాత విదేశాల్లో హానీమూన్‌కు వెళ్లారు. కొద్దిరోజుల క్రితం వ్యాపారవేత్త, నటుడు విషాగన్ వంగముడితో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. సౌందర్య రజనీకాంత్‌కు ఇది రెండో వివాహం. విషాగన్‌తో హానీమూన్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వివాదంగా మారింది. నెటిజన్లు ఎలా తీవ్రంగా స్పందించారంటే..

విషాగన్‌తో మ్యారేజ్
గతంలో సౌందర్య రజనీకాంత్ ప్రముఖ పారిశ్రామిక వేత్త అశ్విన్ రాంకుమార్‌ను వివాహం చేసుకొన్నది. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వారిద్దరూ కోర్టు ద్వారా విడాకులు పొందారు. వారి పరస్పర అవగాహన మేరకు వారికి 2016లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. తాజాగా విషాగన్‌తో వివాహం జరిగింది.
ప్రస్తుతం ఐస్‌లాండ్‌లో హానీమూన్
వివాహం తర్వాత సౌందర్య, విషాగన్ దంపతులు ప్రస్తుతం ఐస్‌లాండ్‌లో పర్యటిస్తున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను సౌందర్య తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు.

రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో
ఇదిలా ఉండగా, పుల్వామాలో ఉగ్రదాడి ఘటన సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్‌గా మారింది. అలాంటి సమయంలో సౌందర్య తన రొమాంటిక్ ఫొటోలను పోస్టు చేయడాన్ని నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకొన్నారు. ఆ ఫోటోలను ఉద్దేశించి తీవ్రంగా కామెంట్లు చేశారు.

నెటిజన్ల ట్రోలింగ్
‘నీకు వివిధ వ్యక్తులతో, వేర్వేరు సంవత్సరాల్లో హనీమూన్ చేసుకొనే అలవాటు ఉండొచ్చు', డియర్ మేడమ్, మనం కోల్పోయింది సినిమా హీరోలను కాదు. రియల్ హీరోలను. మీకేమైనా బుర్ర ఉందా? ఇలాంటి సమయంలో అలాంటి ఫొటోలు పోస్టు చేస్తారా? అని కొందరు అభ్యంతరం చెప్పారు. వారి ఫోటోలను ట్రోల్ చేశారు.


Click it and Unblock the Notifications











