వైభవంగా సౌందర్య రజనీకాంత్ వివాహం.. కమల్ హాసన్, ప్రముఖుల హాజరు.. (ఫోటోస్)
రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య వివాహం నటుడు, బిజినెస్‌మేన్ విశాగన్ వనంగమూడితో సోమవారం ఉదయం చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు కమల్ హాసన్, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
వివాహం అనంతరం సౌందర్య, విశాగన్ దంపతులు... తమ ఫ్యామిలీతో, ప్రముఖులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. రజనీకాంత్ అభిమానులు నూతన దంపతులను విష్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సౌందర్య-విశాగన్ వివాహం
సౌందర్య, విశాగన్ వివాహ వేడుకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి హాజరయ్యారు. సీఎంతో కలిసి రజనీకాంత్ కుటుంబం దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్లి వేడుకలో కమల్ హాసన్
సౌందర్య-విశాగన్ పెళ్లి వేడుకలో ప్రముఖ నటుడు, రజనీకాంత్ ఫ్రెండ్ కమల్ హాసన్ సందడి చేశారు. కమల్ రాగానే రజనీకాంత్ స్వయంగా వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇద్దరికీ రెండో వివాహమే..
ఇటు సౌందర్యతో పాటు, అటు విశాగన్‌కు కూడా ఇది రెండో వివాహమే. సౌందర్య మొదటి వివాహం 2010లో అశ్విన్ రామ్ కుమార్‌తో జరుగగా 2016లో వీరు విడిపోయారు. సౌందర్యకు వేద్ కృష్ణ అనే కుమారుడు కూడా ఉన్నారు.

కుమారుడితో కలిసి సౌందర్య
తన పెళ్లి వేడుకలో కుమారుడు వేద్ కృష్ణతో కలిసి సౌందర్య. తన చేతులకు పెట్టుకున్న మెహందీ చూపుతున్న ఈ పిక్... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లి వీడియో...
తమిళ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరిగింది. కళ్యాణ మహోత్సవం వీడియోను ఇక్కడ చూడొచ్చు.

విశాగన్ వనంగమూడి
విశాగన్ గతేడాది ‘వంజగర్ ఉలగమ్' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఇతడు తమిళనాడుకు చెందిన బిజినెస్‌మేన్ ఎస్ఎస్ వనంగమూడి, ఉషా దంపతుల కుమారుడు.

కొంతకాలంగా ఇద్దరి మధ్య స్నేహం
సౌందర్య రజనీకాంత్ దర్శకురాలిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. నటుడిగా కెరీర్ ప్రారంభించిన విశాగన్‌తో కొంతకాలం క్రితమే స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, పెళ్లి దిశగా అడుగు వేయడం జరిగింది.

స్నేహితులతో కలిసి సౌందర్య
పెళ్లి వేడుకకు ముందు జరిగిన మెహందీ, సంగీత్ వేడుకలో తన సోదరి ఐశ్వర్య, మరికొందరు స్నేహితులతో కలిసి సౌందర్య.

రాఘవ లారెన్స్
సౌందర్య-విశాగన్ పెళ్లి వేడుకలో ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











