ఐశ్వర్య రాయ్ లేదు: రజనీ కూతురు
రాణా సినిమా అటకెక్కడంతో రజనీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాదయన్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 3డి ఎఫెక్టుతో ఈ చిత్రం రూపొందుతోంది. రోబో సినిమాలో రజనీ సరసన నటించిన ఐశ్వర్యరాయ్ 'కొచ్చాదయన్' చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించనుందటూ గత కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై సౌందర్య స్పందిస్తూ.....ఐశ్వర్య నటిస్తున్నట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు.
ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ స్ర్కిప్టు అందించడంతో పాటు, దర్శకత్వంలో కొత్తగా అడుగు పెట్టిన సౌందర్యకు దగ్గరుండి మెలకువళు నేర్పిస్తున్నారు. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అయితే రజనీ సరసన నటించేది తార ఎవరు? అనేది ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది.
ఇక పోతే...భారీ అంచనాలతో మొదలైన 'రాణా' సినిమా రజనీ అనారోగ్యంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కొచ్చాదయన్ సినిమా పూర్తయిన తర్వాత 'రాణా' సినిమా షురూ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











