భర్త పుట్టిరోజున సౌందర్య రజినీకాంత్ ఆనందోత్సాహాలు
సూపర్ స్టార్ రజినీకాంత్ తనయ సౌందర్యా జీవితంలో తిరిగి వసంతం విరబూస్తోంది. గతేడాది విషగన్ వనంగమూడితో మరోసారి మూడుముళ్ల బంధంలోకి ప్రవేశించిన సౌందర్య, ఈ బంధంతో సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే భర్త విషగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన సౌందర్య, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారగా, విషగన్, సౌందర్య తనయుడు వేద్ మధ్య ప్రేమాప్యాయతలు జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటోంది.
సౌందర్య రజినీకాంత్ కు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. గతంలో వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్ ను సౌందర్య వివాహమాడారు. 2015లో వీరిద్దరికీ వేద్ కృష్ణ అనే బాబు పుట్టగా, 2017లో మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

అనంతరం కెరీర్ పై దృష్టిపెట్టిన సౌందర్య నటుడు వ్యాపారవేత్త అయిన విషగన్ వనంగమూడి అనే వ్యక్తిని 2019లో వివాహమాడారు. విషగన్, వేద్ మధ్య ప్రేమానుబంధాలు పెనవేసుకున్నాయని సౌందర్య పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. తాజాగా భర్త పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఫొటోలతో, ఈ కుటుంబం మధ్య పెనవేసుకున్న ప్రేమానుబంధాలు జనాలకూ ఆనందాన్ని పంచుతోంది.


Click it and Unblock the Notifications











