రజనీకాంత్ కూతురు పెళ్లి.. సౌందర్య ఏం చేశారో తెలుసా? ముహుర్తం ఎప్పడంటే!
సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ పెళ్లి వార్తలు ఇటీవల కాలంలో మీడియాలో గుప్పుమంటున్నాయి. నటుడు, వ్యాపారవేత్త విషాగన్ వనంగముడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు విస్రృతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజా ఆమె తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించడం అనేక అనుమానాలకు దారి తీసింది. తన పెళ్లికి ముందు సౌందర్య రజనీకాంత్ ఆలయాల్లో పూజలు చేస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే

మూడు పుణ్యక్షేత్రాల సందర్శన
రజనీకాంత్ కూతురు ఇటీవల కన్యకుమారిలోని మూడు ప్రసిద్ధ ఆలయాలను సందర్శించారు. ఆమె వేదపండితులతో పలు పూజలు చేయించినట్టు సమాచారం. అంతేకాకుండా ఇటీవల సౌందర్య రజనీకాంత్ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించి పూజలు నిర్వహించారు.

వివాహానికి ముహుర్తం ఖరారు
సౌందర్య రజనీకాంత్ వివాహంపై అనేక వార్తలు వస్తున్నాయి. ఆమె వివాహం ఫిబ్రవరి 11న జరిపించేందుకు ముహుర్తాలు నిర్వహించినట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం మీడియాకు వెల్లడించకపోవడం కొంత సందేహంగా మారింది.

మొదటి భర్తతో విడాకులు
గతంలో సౌందర్య రజనీకాంత్ ప్రముఖ పారిశ్రామిక వేత్త అశ్విన్ రాంకుమార్‌ను వివాహం చేసుకొన్నది. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వారిద్దరూ కోర్టు ద్వారా విడాకులు పొందారు. వారి పరస్పర అవగాహన మేరకు వారికి 2016లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు.

రెండో ప్రేమలో పడిన సౌందర్య రజనీకాంత్
అశ్విన్‌తో విడాకులు పొందిన తర్వాత సౌందర్యకు విషాగన్ వనంగముడి మధ్య ప్రేమ వ్యవహారం బలపడింది. దాంతో ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్టు సమాచారం. విషాగన్ వనంగముడి వంజగర్ ఉలగం అనే సినిమాలో నటించాడు. కాకపోతే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.

దర్శకురాలిగా సినిమా పరిశ్రమతో..
ఇక సౌందర్య రజనీకాంత్ విషయానికి వస్తే బాబా, మజా, శివకాశి, శివాజీ చిత్రాలకు గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వెంకట్ ప్రభు నిర్మించిన గోవా చిత్రానికి నిర్మాతగా మారారు. ఆ తర్వాత కొచ్చడయాన్, విఐపీ2 సినిమాలకు దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











