Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆశ్చర్యం... సూర్యను ప్రశ్నించి క్రికెటర్ సురేష్ రైనా, అదిరిపోయే రిప్లై!
సౌత్ స్టార్ సూర్య త్వరలో NGK (నంద గోపాల కృష్ణ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సూర్య అభిమానులతో ట్విట్టర్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా లైన్లోకి రావడం, సూర్యను ప్రశ్నించడం చర్చనీయాంశం అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సూర్యకు రైనా ఆసక్తికర ప్రశ్న సంధించారు. 'చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మీకు ఏ ఆటగాడు అంటే ఇష్టం? ఎందుకు?' అని ప్రశ్నించారు.
ఆశ్చర్యపోయిన సూర్య
సురేష్ రైనా తన ట్విట్టర్ చాటింగ్ లైన్లోకి రావడంతో సూర్య ఆశ్చర్యపోయారు. మీకు నాతో మాట్లాడటానికి సమయం దొరికిందంటే నమ్మలేక పోతున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ అంటే ఇష్టమని, ఈ జట్టులో నేను కలిసిన తొలి ఆటగాడు కూడా ఆయనే... ఆ తర్వాత మిమ్మల్ని(రైనా) కలిశాను. ఆ సమయంలో మీరే వచ్చి నన్ను పలకరించడం ఇప్పటికీ గుర్తుంది. మీతో కలిసి దిగిన ఫోటో నా వద్ద ఇప్పటికీ ఉందని సూర్య తెలిపారు.
NGK (నంద గోపాల కృష్ణ)
NGK (నంద గోపాల కృష్ణ) సినిమా గురించి వివరాల్లోకి వెళితే.... ఈ చిత్రానికి శ్రీరాఘవ(సెల్వ రాఘవన్) దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
సినిమాపై భారీ హైప్
ఇటీవల విడుదలైన NGK టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సూర్య కెరీర్లో ది బెస్ట్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. సూపర్య తన కెరీర్లో ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా NGK (నంద గోపాల కృష్ణ) అలరించబోతోంది.
సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ పాత్రలు కూడా ఆసక్తికరంగా
సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ పాత్రలు కూడా ఆసక్తికరంగా మలిచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., ఆర్ట్: ఆర్.కె.విజయ్ మురుగన్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ.