విషాదంలో ప్రముఖ దర్శకుడు.. తండ్రి మరణంతో శోకసంద్రంలో..

ప్రముఖ దర్శకుడు సిరుతాయ్ శివ విషాదంలో మునిగిపోయారు. అనారోగ్యంతో తన తండ్రి జయకుమార్ అకాల మరణం పొందడంతో శివ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. జయకుమార్‌కు శివ, బాల ఇద్దరు కుమారులు. భార్య ఉన్నారు.

జయకుమార్ విషయానికి వస్తే ప్రముఖ తమిళ నిర్మాత ఏకే వేలన్‌కు కుమారుడు. ఆయన డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్‌గా అందరికి సుపరిచితులు. తండ్రి అడుగు జాడల్లోనే శివ తమిళ, తెలుగు ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. సినిమాటోగ్రాఫర్‌గా ఉంటూనే శివ దర్శకుడిగా మారారు.

పితృవియోగంతో బాధపడుతున్న శివకు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

South director Siruthai Sivas father passes away

సిరుతాయ్ శివ కెరీర్ విషయానికి వస్తే.. 2008లో శౌర్యం సినిమాతో దర్శకుడిగా మారారు. శంఖం, దరువు చిత్రాలకు ధర్శకత్వం వహించారు. తమిళంలో సిరుతాయ్ చిత్రంతో తమిళంలో పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి సిరుతాయ్ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.

అజిత్‌తో వీరమ్, వేదాళం, వివేగమ్, విశ్వాసం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రజనీకాంత్‌తో అన్నాతే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమాటోగ్రాఫర్‌గా శ్రీరాం, మనసు మాట వినదు. గౌతమ్ ఎస్ఎస్సీ, బాస్ చిత్రాలకు పనిచేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X