'రౌడీ రాథోర్'లో సౌత్ సూపర్ స్టార్ డాన్స్
రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన సూపర్‌హిట్ ఫిల్మ్ 'విక్రమార్కుడు'కు రీమేక్‌గా ప్రభుదేవా 'రౌడీ రాథోర్' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జింతాకా..పాటకు గానూ సౌత్ సూపర్ స్టార్ హీరో తీసుకున్నారు. తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన విజయ్. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న 'రౌడీ రాథోర్'లో ఓ పాటలో అతను స్పెషల్ అప్పీరెన్స్‌గా నటించాడు. ముంబైలోని ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించిన ఈ పాటలో రెండు రోజుల పాటు పాల్గొన్న విజయ్ ఉచితంగానే నటించారు. నిర్మాతలు రెమ్యునేషన్ చెల్లించడానికి సిద్ధమైనా విజయ్ దాన్ని సున్నితంగా తోసిపుచ్చి వార్తల్లో కెక్కాడు.
ఈ విషయమై విజయ్ మాట్లాడుతూ..."అక్షయ్‌కుమార్ నటించిన 'ఖిలాడీ' కాలం నుంచీ నేను ఆయన అభిమానిని. 'రౌడీ రాథోర్' ప్రోమోస్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉన్నాయి. చాలా కాలం తర్వాత అక్షయ్ మళ్లీ యాక్షన్ హీరో అవతారంలో కనిపించబోతున్నాడు. అందుకే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇందులో ఓ పాటలో కనిపించాల్సిందిగా ప్రభుదేవా అడిగిన వెంటనే సరేనన్నా. వీళ్లంతా ఎంతో స్నేహంగా మసలుకున్నారు. దీన్ని ఎప్పటికీ నేను మరవను'' అని తెలిపాడు విజయ్. ఈ పాటలో విజయ్‌తో పాటు అనిల్‌కపూర్, గోవిందా కూడా కనిపించనున్నారు.
ఇక ఈ చిత్రం మొన్నీ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది.ఇప్పుడు హిందీలో రీమేక్ అయ్యి విడుదలకు రెడీ అవుతోంది. ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం మంచి బిజినెస్ జరిగిందని సమాచారం. పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పినట్లు చెప్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేసింది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా చాలా రోజులు పాటు స్క్రిప్టు పై కసరత్తులు చేసి తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.
ఇక విజయ్ ఈ చిత్రం చేయటానికి కారణం... బాలీవుడ్ కి తనను తాను అలవాటు చేసుకోవటానికే అంటున్నారు. భవిష్యత్ లో బాలీవుడ్ లో కూడా సినిమాలు రిలీజ్ చేయాలనే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే విజయ్ ని సినిమాలో తీసుకోవటానికి కారణం...తమిళంలో సైతం తను డైరక్ట్ చేసిన చిత్రం కావటంతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయవచ్చని,శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యే అలోచనతో అని చెప్తున్నారు. ఇలా ఎవరికి వారు తమదైన ఆలోచనలతో ఈ గెస్ట్ రోల్ ని తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











