Happy birthday Vijay: వీడు హీరో ఏంటి అన్నారు.. కానీ అతనే ఇప్పుడు సౌత్ నెంబర్ వన్ హీరో!

సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువసార్లు 100కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న ఏకైక హీరో విజయ్. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య నిత్యం పోటీ నడుస్తూనే ఉంటుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా టాప్ ప్లేస్ ఎవరు దక్కించుకుంటున్నారు అన్నదే అసలు పాయింట్. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ కంటే హై రేంజ్ లో సక్సెస్ అందుకుంటున్నాడు దళపతి విజయ్. నేడు ఆయన పుట్టినరోజు. కెరీర్ పై ఒక లుక్కేస్తే..

Recommended Video

Happy Birthday Vijay : Thalapathy Vijay Box Office Career
 వీడు హీరో ఏంటి అన్నారు..

వీడు హీరో ఏంటి అన్నారు..

1992లో నాలయ్యా తీర్పు అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు విజయ్. ఆ సినిమాకు విజయ్ తండ్రి చంద్ర శేఖర్ దర్శకత్వం వహించాడు. అయితే కొన్నాళ్ళకు విజయ్ ఎంట్రీ పై విమర్శలు చాలానే వచ్చాయి. యాక్టింగ్ లో టైమింగ్ లేదు.. వీడు హీరో ఏంటి అంటూ కామెంట్స్ కూడా చేశారు. వాటన్నిటినీ మెల్లగా దాటుకుంటూ వచ్చాడు విజయ్.

ఫాలోయింగ్ కూడా పెరిగింది..

ఫాలోయింగ్ కూడా పెరిగింది..

కొన్నాళ్లకు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో పుట్టాడు అని అందరికి తెలిసింది. ఎప్పుడైతే విజయ్ బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచే అభిమానుల ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వచ్చింది. సినిమా మినిమామ్ బాక్సాఫీస్ హిట్టయ్యేలా ఇన్నాళ్లు కెరీర్ ని ఒక ట్రాక్ లో సెట్ చేసుకుంటూ వచ్చాడు.

 టాలీవుడ్ మార్కెట్..

టాలీవుడ్ మార్కెట్..

మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తుపాకి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆర్మీ ఆఫీసర్ గా విజయ్ నటించిన విధానం తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా నచ్చేసింది. అంతకుముందు వరకు తెలుగులో పెద్దగా క్రేజ్ అందుకోలేదు. కానీ తుపాకి సినిమా విజయ్ కి తెలుగులో కూడా ఒక మార్కెట్ ఉందని నీరూపించింది.

మూడు వందల కోట్లు..

మూడు వందల కోట్లు..

ఆ తరువాత మురగదాస్ దర్శకత్వంలోనే కత్తి, సర్కార్ సినిమాలు చేసిన విజయ్ తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అనంతరం ఎక్కువగా అట్లీ దర్శకత్వంలో సినిమాలు చేశాడు విజయ్. తెరి, మెర్సల్ సినిమాలతో పాటు బిగిల్ సినిమా కూడా విజయ్ మార్కెట్ ని మూడు వందల కోట్లకు తెచ్చింది. ఇక నెక్స్ట్ మాస్టర్ సినిమాతో రానున్న విజయ్ ఆ సినిమాతో కూడా సక్సెస్ అంసుకునేలా కనిపిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X