లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అవమానం.. రజనీకాంత్ సినిమాపై విమర్శలు!

గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పెట్ట చిత్రంలోని మరణ మాస్ సాంగ్ ఇంటర్నెట్ ని దున్నేస్తోంది. రజనీకాంత్ సినిమాలో అంటే మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే అంశాలు ఉండాలి. అందుకు తగ్గట్లుగానే సంగీత దర్శకుడు అదిరిపోయే మాస్ బీట్ అందించారు. బి, సి సెంటర్ ఆడియన్స్ కు బాగా ఎక్కేసే డప్పు వాయిద్యాలతో అనిరుద్ మోత మోగించాడు. మరణ మాస్ సాంగ్ వింటూ రజని ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే..మరోవైపు వివాదం చెలరేగుతోంది. ఈ పాట వలన లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులు హర్ట్ అయ్యారు. ఎందుకో ఆ వివరాలు చూద్దాం!

కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో

కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో

ప్రస్తుతం సూపర్ స్టార్ రజని చిట్టి 2.0గా మారి థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. పెట్ట చిత్రం సంక్రాంతికి సిద్ధం అవుతోంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రజని ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ సరసన త్రిష, సిమ్రన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు.

చాలా కాలం తర్వాత

చాలా కాలం తర్వాత

ఒకప్పుడు సూపర్ స్టార్ రజని సినిమా అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఉండాల్సిందే. కానీ గత కొన్ని చిత్రాలుగా రజని చిత్రాల్లో బాలు పాడే అవకాశం రాలేదు. చాలా రోజుల తరువాత బాలు పెట్ట చిత్రం కోసం తన గాత్రాన్ని వినిపించారు. మరణ మాస్ సాంగ్ లో కొన్ని లైన్లు ఆయన పాడారు. సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చగా మారిపోయింది.

బాలుని అవమానించారు

బాలుని అవమానించారు

లెజెండ్రీ సింగర్ అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని పెట్ట చిత్ర యూనిట్, సంగీత దర్శకుడు అనిరుద్ అవమాన పరిచారని విమర్శలు ఎదురవుతున్నాయి. బాలు అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అంతటి లెజెండ్రీ సింగర్ చేత కేవలం కొన్ని లైన్లు మాత్రమే పాడించడం ఏంటనేది వారి ప్రశ్న. బాలుచేత పూర్తి పాట పాడించి ఉండాల్సింది అని అంటున్నారు.

నాకు సంతోషమే

నాకు సంతోషమే

మరణ మాస్ సాంగ్ గురించి బాలు స్పందించారు. నేను పాడింది కొన్ని లైన్లు మాత్రమే. అయినా కూడా చాలా రోజుల తరువాత రజని కోసం పాడడం సంతోషంగా ఉంది. పెట్ట చిత్ర యూనిట్ ఈ పాటకు నా వాయిస్ అవసరం అని భావించి నన్ను ఎంపిక చేసుకున్నారు అని బాలు అన్నారు. రజనీకాంత్ బాడీ లాంగ్వేజ్, వాయిస్ కు సరిపోయేలా పాటలు పాడే ఏకైన సింగర్ బాలసుబ్రహ్మణ్యం అనే పేరు ఉంది. అందుకే గతంలో బాలు పాట లేకుండా రజని సినిమా ఉండేది కాదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X