SP Balasubrahmanyamకు కన్నీటి వీడ్కోలు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. దహనం ఎందుకు చేయలేదంటే!
ప్రఖ్యాత గాయకుడు, సంగీత దిగ్జజం ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు భావోద్వేగ పరిస్థితుల్లో ముగిశాయి. కరోనా పరిస్థితుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ వందలాది మంది అభిమానులు తరలిరాగా ఆయన ఫామ్‌హౌస్‌లో అంతిమ యాత్ర కొనసాగింది. అశ్రునయనాలతో గాన గంధర్వుడికి తుది వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలు..
Recommended Video

అభిమానుల తాకిడితో
సుప్రసిద్ద గాయకులు బాలు శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగు గంటల సమయంలో ఎంజీఎం హాస్పిటల్ నుంచి ఆయన నివాసానికి భౌతిక కాయాన్ని తరలించారు. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఆయన ఇంటి వద్ద ఉంచారు. సాయంత్రం వేళ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో తామరైపాక్కం ఫాంహౌస్‌కు తరలించారు.

శ్రౌత శైవ వైదిక శైవ సాంప్రదాయం ప్రకారం
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలకు శనివారం ఉదయం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సంప్రదాయ పద్దతుల్లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించారు. శ్రౌత శైవ వైదిక శైవ సాంప్రదాయ పద్దతుల్లో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. కుమారుడు ఎస్పీ చరణ్ చేత వేద పండితులు పూజలు చేయించారు. అనంతరం శ్రౌత శైవ వైదిక శైవ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రకారం ఎస్పీబాలు పార్దీవ దేహాన్ని ఖననం చేశారు.

తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియల సమయంలో తమిళనాడు పోలీసులు గౌరవం వందనం సమర్పించారు. గాల్లోకి తుపాకులు పేల్చి దిగ్గజ గాయకుడు ఎస్పీబాలుకు గౌరవం వందనం సమర్పించారు. బాలు అంత్యక్రియల కార్యక్రమాన్ని తమిళనాడు ప్రభుత్వ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. కరోనావైరస్ లాక్‌డౌన్, ఆంక్షలు, నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు.

తమిళ సూపర్‌స్టార్ విజయ్ హాజరు
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. తమిళ సినీ ప్రముఖుల్లో తమిళ సూపర్ స్టార్ విజయ్ హాజరయ్యారు. ఎస్పీ బాలుకు విజయ్ కన్నీటి వీడ్కోలు పలికారు. మరి కొంత మంది ప్రముఖులు బాలసుబ్రమణ్యంకు శ్రద్దాంజలి ఘటించారు.

ఇళయరాజా వీడియోతో శ్రద్దాంజలి
తన స్నేహితుడు బాలు అంత్యక్రియలకు హాజరుకాలేకపోవడంపై సంగీత దర్శకుడు ఇళయరాజా ఎమోషనల్ అయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధానికి చిహ్నంగా వీడియో రూపంలో ఓ పాటను రిలీజ్ చేసి శ్రద్దాంజలి ఘటించారు. తాను హాజరుకాలేకపోవడంపై బాధను వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకొన్నట్టు సన్నిహితులు తెలిపారు.


Click it and Unblock the Notifications











