కొడుకు నిర్వాకానికి ఇళయరాజాను ఆశ్రయించిన ఎస్ పి బాలు...?

By Sindhu

ప్రముఖ గాయకుడు యస్ పిబాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ తనను రేప్ చేయబోయాడంటూ తమిళ సెక్సీ తార సోనా పోలీస్ కేసు పెట్టి సంచలనానికి కేంద్రబిందువైంది. కోర్టు బయట కేసు పరిష్కారానికి చరణ్ ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె ఒప్పుకోవడం లేదు. చరణ్ తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందేననీ, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ సోనా తాజాగా మీడియాకు చెప్పింది. నిన్న సాయంకాలం చెన్నయ్ ఎగ్మోర్ లోని పోలీస్ కమీషనర్ కార్యాలయానికి వచ్చి, కేసుకు సంబంధించిన వీడియో ఆధారాలను అందజేసిందని కొన్ని చానెల్స్ లో ప్రచారం అవుతోంది.

తాను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నానంటూ చరణ్ తనపై వదంతులు సృష్టిస్తున్నాడనీ, తాను తప్పు చేయకపోయివుంటే దర్శకుడు వెంకట్ ప్రభుతో చరణ్ ఎందుకు రాజీకి ప్రయత్నిస్తున్నాడని ఆమె ప్రశ్నించింది. సోనా పట్టుదల చూస్తుంటే ఈ వివాదం మరింత ముదిరిపోయేలా వుంది. మరోపక్క సమాజంలో పెద్దమనిషిగా, గౌరవనీయ వ్యక్తిగా పేరున్న గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ సంఘటనతో అవమానభారంతో వున్నారని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో చరణ్ కు మద్రాస్ హై కోర్ట్ యాంటీసిపెటరీ బెయిల్ మంజూరుచేసింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం తాజాగా అందిన వార్త ఏమిటంటే ఈ విషయాన్ని త్వరగా క్లోజ్ చేయాలని ఎస్ బి బాలసుబ్రమణ్యం కొడుకుని క్షమాపణ చెప్పమిన అంటున్నాడట. కానీ చరణ్ అంగీకరించకపోవడంతో చివరికి తన స్నేహితుడు ఇళయరాజా దగ్గరికెళ్లి...ఎలాగైనా చరణ్ కి సర్థి చెప్పు..మీరు చెబితే వింటాడని ఎస్ పి బాలు కోరినట్టు సమాచారం. కానీ ఈ జనరెషన్ పిల్లలు మనం చెబితే వినరు అని ఎస్ బి బాలు గారి కోరికను ఇళయరాజాగారు కాదన్నారని వినికిడి.....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X