twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాస్పటల్ లో చేరిన ఎస్పీ బాలసుబ్రమణ్యం

    By Srikanya
    |

    చెన్నై: ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం,...ని బుధవారం అనారోగ్యం గా ఉండటంతో కుటుంబసభ్యులు దగ్గరలోని హాస్పటిల్ లో జాయిన్ చేసినట్లు సమాచారం. వైద్యులు టెస్ట్ లన్నీ చేసి వెంటనే డిశ్చార్జ్ చేసారు. ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన పనిలేదని,కేవలం రెస్ట్ తీసుకుంటే చాలని చెప్పినట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.

    ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం రీసెంట్ గా ప్రధానపాత్రలో నటించిన 'మిథునం' చిత్రం రిలీజై అంతటా ప్రసంసలు పొందుతోంది. ప్రముఖ రచయిత, నటుడు తణికెళ్ల భరిణి 'మిథునం'అనే ఓ ఫీచర్ ఫిల్మ్ ని డైరక్ట్ చేసారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ చిత్రం విడుదలై ఓ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. శ్రీరమణ 'మిథునం' కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం రూపొందింది.

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ''మిథునం' కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన శ్రీరమణ గారికి అభినందనలు. తనికెళ్ల భరణి నాకు తెలిసిన వాడైనందుకు చాలా గర్వపడుతున్నాను. 'మిథునం' అచ్చమైన తెలుగు సినిమా. ఇలాంటి సినిమాలు రావాలి... అందరూ ఆదరించాలి. ఈ రోజుల్లో ఒక మంచి సినిమా బైటికి రావాలంటే పురిటి నొప్పులు పడుతోంది. 'మిథునం' లాంటి మంచి సినిమాలకు ప్రభుత్వ పెద్దలు సహకరించాలి. ఓ మామూలు ఇంటిలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆ ఇంటిని ఈ చిత్రానికి గుర్తుగా ఉంచేస్తానని నిర్మాత చెప్పడం అభినందనీయం' అన్నారు.

    'మిథునం' చిత్రం వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. వీరి ప్రేమాభిమానాలు ప్రధానాంశంగా జీవన వేదాతం ఇమిడి కథ నడుస్తుంది. ఇదే కథలో గతంలో మళయాళంలో ఓ చిత్రం నిర్మించారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే భరిణిగారు ఈ కథని ఇప్పటి తరానికి అర్దమయ్యేటట్లుగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని,అందరూ చూసేటట్లుగా రూపొందించారు. రీసెంట్ గా ఈ చిత్రం మీడియా వారికి ప్రదర్శించారు. అందరూ ఈ చిత్రం బావుందని ప్రదర్శించారు.

    English summary
    
 South India's popular singer SP.Balasubramanyam was hospitalised in Chennai after he fell sick and family members shifted him to nearby hospital. Doctors after conducting preventive tests discharged him immediately. They said there is nothing to worry about his health and advised Balu to take rest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X