టాప్ హీరో కన్నా హీరోయిన్ మీదే స్సెషల్ ఫోకస్..!?
విక్రమ్, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'నాన్నా" సినిమా త్వరలో విడుదలకు సిద్దమైన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో అమలా పాల్ అనే మరో మీరోయిన్ కూడా నటిస్తున్నప్పటికీ ఆమె పేరు ఎక్కడా వినిపించడంలేదు. సినిమా పబ్లిసిటీకి సంబంధించినంతవరకు. ప్రస్తుతం కోలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ అనుష్క చుట్టూనే సినిమా పబ్లిసిటీ జరుగుతుండడం గమనార్హం. ఆ మాటకొస్తే విక్రమ్ కన్నా అనుష్క ఫోటోలనే పబ్లిసిటీలో ప్రముఖంగా వినియోగిస్తున్నారు.
తెలుగు తమిళ పరిశ్రమల్లో ఆల్రెడీ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అనుష్క, 'నాన్న" సినిమా పబ్లిసిటీలో తనకు దక్కుతోన్న ప్రాధాన్యతను చూసి ఉబ్బతబ్బిబ్బవుతోంది. ఇప్పటిదాకా చేయని భిన్నమైన పాత్రను 'నాన్న"లో తాను చేస్తున్నట్టు చెబుతోన్న అనుష్క, నటుడిగా విక్రమ్ విశ్వరూపాన్ని 'నాన్న" సినిమా లో చూడొచ్చని చెబుతోంది. మరోపక్క, విక్రమ్ కూడా అనుష్క నటనకు ప్రేక్షకులు ప్లాటయిపోతారంటూ అనుష్కని ఆకాశానికెత్తేస్తున్నాడు. ఏదిఏమైనా, తమిళంలో టాప్ హీరో ఇమేజ్ వున్నా, విక్రమ్ కన్నా పబ్లిసిటీ విషయంలో అనుష్కపై దర్శక నిర్మాతలు స్పెషల్ ఫోకస్ పెట్టడం విశేషమే మరి.


Click it and Unblock the Notifications











