కొత్త చిత్రంపై రజనీ కన్ఫూజన్

By Srikanya

చెన్నై : తన తదుపరి చిత్రానికి ఎవర్ని దర్శకుడిగా ఎంపిక చేసుకోవాలనే విషయంలో సందిగ్ధంలో ఉన్నాడట సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. రోబో వంటి విజయవంతమైన చిత్రం తర్వాత రజనీకాంత్‌- కేఏస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో 'రాణా' తెరకెక్కించేందుకు సన్నాహాలు జరిగాయి. రజనీ అనారోగ్యానికి గురికావటంతో అదికాస్తా అటకెక్కింది. రజనీకాంత్‌కు విశ్రాంతి కావాలని, నటించినా శరీరానికి శ్రమలేకుండా చూసుకోవాలని వైద్యులు సూచించారు.

తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో యానిమేషన్‌ చిత్రం 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపారు రజనీ. దీనికోసం కేవలం పదిరోజులే నటించారు. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల చెంతకురానుంది. మరోవైపు కేవీ ఆనంద్‌ ఆయనకు ఓ కథ వినిపించగా, కథ నచ్చినా అందులో రిస్కీ యాక్షన్‌ సన్నివేశాలున్న దృష్ట్యా రజనీకాంత్‌ ఆలోచనలో పడ్డారట.

అదే సమయంలో శంకర్‌తో ఓ సినిమా చేద్దామా.. అని కూడా ఆలోచించారట. ఒకే సన్నివేశాన్ని పలుమార్లు చిత్రీకరించే అలవాటు శంకర్‌కు ఉన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారట. కొత్త చిత్రం వీరిద్దరితోనా... లేదంటే మరో కొత్త దర్శకుడా... అంటూ ఆలోచనలో పడ్డారట ఆయన.

సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం తమిళనాడులోనే పాపులర్ కాదు...ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ ఇదివరకు నటించని 'రోబో' చిత్రం తెలుగులో విడుదలై సూపర్ హిట్ అవడంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. తాజాగా రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం 'కొచ్చాడయాన్' తెలుగులో 'విక్రమ సింహ' పేరుతో విడుదలవుతోంది. 'విక్రమ సింహ' చిత్రం రాజుల నాటి కథాంశంతో తెరకెక్కిన సినిమా. రజనీ కూతురు ఐశ్వర్య ఆర్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెఎస్ రవి కుమార్ ఈచిత్రానికి స్క్రిప్టు అందించారు.

పాండ్య సామ్రాజ్య రాజు కొచ్చాడయాన్ రణధీరన్ స్టోరీ ఇన్స్‌స్పిరేషన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 19, 2012లో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ నవంబర్, 2012లో పూర్తయింది. అయితే గ్రాఫిక్స్‌తో కూడిన ప్రొస్టు ప్రొడక్షన్ పనులు హెవీగా ఉండటంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటికీ పోస్టు ప్రొడక్షన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మళయలం, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈచిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X