స్పైసీ హీరోయిన్ తో హాట్ రొమాన్స్ చేయనున్న విక్రమ్..!?
'వేదం', 'మిరపకాయ్', 'వాంటెడ్' చిత్రాల ఫేం ధీక్షా సేథ్, కోలీవుడ్ లోకి అడుగుపెడ్తోన్న సంగతి తెల్సిందే. విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ మసాలా ఎంటర్ టైనర్ లో ధీక్షా సేథ్, సెక్సీ సెక్సీ హీరోయిన్ గా తన సత్తా చాటనుందట. సింగనమల రమేష్ బాబు నిర్మిస్తోన్న ఈ సినిమా తెలుగులోనూ విడుదల చేస్తారు. కోలీవుడ్ కి వెళ్ళినా, తాను తన కార్యకలాపాలన్నీ హైద్రాబాద్ నుంచే నిర్వహిస్తానంటోన్న దీక్షా సేథ్, తన తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాలకేనని తెగేసి చెబుతోంది.
అన్నట్టు అమ్మడికి విక్రమ్ అన్నా, అతని నటన అన్నా భలే ఇష్టమట. 'అపరిచితుడు' సినిమా చూశాక విక్రమ్ కి వీరాభిమానినైపోయాననీ, అతనితో కలిసి నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమనీ ఓ రేంజ్ లో విక్రమ్ ని మోసేస్తోంది. ఇదిలా వుంటే, ఈ సినిమా ధీక్షా సేథ్ టూ పీస్ బికినీలో కన్పించనుందనీ, విక్రమ్ ధీక్షాసేథ్ ల మధ్య హాటు హాటు ముద్దు సన్నివేశాలుంటాయనీ కోలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. మరో పక్క, దీక్షాసేథ్ కి తమిళ సినీ పరిశ్రమనుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ధీక్షా సేథ్ తో నటించేందుకు విజయ్, సూర్య, తదితరులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారట.


Click it and Unblock the Notifications











