ఆ ముగ్గురికి నో చెప్పిన శ్రియా!!
శివాజీ సినిమాతో తమిళ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగిన నటి శ్రియా తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. అదేమంటే రజనీకాంత్, కమల్ హాసన్ తరువాత స్థానాల్లో కొనసాగుతున్న అజిత్, సూర్య, శింబులతో నటించే అవకాశాన్ని ఆమె తోసిరాజంది.
వివరాలలోకి వెళితే... రాజు సుందరం దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందనున్న సినిమాలో, సూర్య హీరోగా ఎవిఎమ్ సంస్థ నిర్మించనున్న సినిమాలో, శింబు హీరోగా రూపొందనున్న శిలంబాట్టం సినిమాలో హీరోయిన్ గా శ్రియాకు అవకాశం వచ్చింది. అయితే వీటన్నిటిని శ్రియా తిరస్కరించింది. వీరందరికీ ఆమె ఒకే సమాధానం చెప్పింది. జెస్సీ మెట్ కాఫ్ హాలీవుడ్ సినిమాలో నటించాల్సి ఉన్నందున ముగ్గురు హీరోల సినిమాలకు శ్రియా నో చెప్పింది. తనకు కాల్షీట్స్ సమస్య ఉన్నందున్న ఇక్కడి సినిమాలలో నటించడం కుదరదని చెప్పింది. ప్రస్తుతం శ్రియా హిందీలో మూడు సినిమాలలోనూ, తమిళంలో మూడు సినిమాలలోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











