డిసెంబరు 12న ప్రపంచ రజనీ అభిమానులందిరికీ పండుగ రోజు. ఆరోజు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు. అయితే ఆ వేడుకలు ఈ సంవత్సరం జరపవద్దని రజనీ పిలుపునిచ్చారు. శ్రీలంకలో ఎల్టీటీఈకి, సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో నలిగిపోతున్న తమిళ ప్రజలకు సంఘీభావంగా ప్రకటించాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. అందుకే రజనీ ఈ తరహా నిర్ణయం తీసుకుని తన అభిమానులకు చెప్పటం జరిగింది. శ్రీలంక యుద్ధానికి నిరసనగానే తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు జరుపుకోవద్దని ఆయన సూచించారు. మరో ప్రముఖ హీరో కమల్‌హాసన్ కూడా ఈ నెల 7వ తేదీన పుట్టినరోజు వేడుకలను జరుపుకోకుండా నిరసన తెలిపారు.