»   » హీరోయిన్‌ను కొట్టిన దర్శకుడు, ఆసుపత్రికి తరలింపు

హీరోయిన్‌ను కొట్టిన దర్శకుడు, ఆసుపత్రికి తరలింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటి శ్రీప్రియాంకపై దర్శకుడు కళంజియం చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దర్శకుడు ఆమెను కావాలని కొట్టలేదు. సినిమా షూటింగులో భాగంగా ఓ సీన్ చిత్రీకరిస్తుండగా పొరపాటున ఆయన చేయి తగిలి ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఈ సినిమాకు దర్శకడు కళంజియం దర్శకత్వం వహించడంతో పాటు నటిస్తున్నాడు. వాస్తవానికి ఈ సీన్లో అతను రైతును కొట్టాలి. అయితే పొరపాటను అతని చేయి శ్రీప్రాయాంక చెవి వద్ద తాకింది. దెబ్బ కాస్త బలంగా తాకడంతో ఆమెసొమ్మసిల్లి పడిపోయింది. ముందుగా సీన్ ప్రాక్టీస్ చేసినప్పటికీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది.

Sri Priyanka Slapped By Kalanjiyam; Actress Faints On Sets

ఈ సంఘటనపై శ్రీప్రియాంక తండ్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తన కూతురు కోలీవుడ్లో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశ పడిందని, తాజా సంఘటన ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాడు. దర్శకుడితో పాటు సినిమాకు సంబంధించిన ఎవరూ కూడా తన కూతురును చూడటానికి రాలేదని, ఆమె పరిస్థితి ఎలా ఉందనే విషయం అసలు తెలుసుకోలేదని అంటున్నాడు.

ఈ సంఘటనపై దర్శకుడు కళంజియం స్పందిస్తూ....ముందు సీన్ రిహార్సల్ చేసామని, ఆమె తప్పిదం వల్లనే ఇలా జరిగిందని అన్నారు. ఆమెకు బలంగా నా చేయితగిలి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో షాకయ్యాను. అసలు ఇలా జరిగి ఉండ కూడదను అని వ్యాఖ్యానించారు. ఈ సంఘటనపై శ్రీప్రియాంక తండ్రి ఎలాంటి ఫిర్యాదు ఇవ్వ లేదు. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ విక్రమన్ మాట్లాడుతూ షూటింగుల్లో ఇలాంటివన్నీ సాధారణమే, ఒక వేళ ఆమె ఫిర్యాదు చేస్తే ఏం చేయాలనే విషయం ఆలోచిస్తాం అని తెలిపారు.

English summary
Young actress Sri Priyanka seems to have had her first bad experience in films after being slapped by Kalanjiyam. The actress fainted on the sets and she was rushed to a hospital. This unfortunate incident happened in Sankaran Koil during the shooting of the forthcoming Tamil movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu