'శ్రీరామ రాజ్యం' తమిళ వెర్షన్ రిలీజ్ డేట్
బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన శ్రీరామ రాజ్యం చిత్రం త్వరలో తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. తెలుగులో గొప్ప విజయాన్ని చవిచూసిన ఈ చిత్రం తమిళంలో ఈ నెల 13న విడుదల కానుంది. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరాముడిగా బాలకృష్ణ, సీతగా నయనతార, వాల్మీకి మహర్షిగా అక్కినేని నాగేశ్వరరావు, భూదేవిగా రోజా, సుమిత్రగా కెఆర్ విజయ, లక్ష్మణుడిగా శ్రీకాంత్ నటించారు. ఈ చిత్రానికి ఇళయరాజా రసవత్తరమైన సంగీతం, బాపు దర్శకత్వ ప్రతిభ శ్రీరామ రాజ్యంను ఒక అద్భుత కళా ఖండంగా తీర్చిదిద్దారని ప్రశంసలు వచ్చాయి.
ఇక ఇప్పటికే అక్కడ ఛానెల్స్ లో వేయటానికి ప్రోమోలు రెడీ అయ్యాయి. అక్కడ కూడా తెలుగు మాదిరిగానే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానకి డబ్బింగ్ చెప్తున్నారు. పురాణ ఇతిహాసాలతో తెరకెక్కిన చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని నిర్మాతలు భావించి ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేస్తున్నామంటున్నారు. ఇక బాలకృష్ణ మరో చిత్రం అధినాయకుడు కూడా త్వరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











