శ్రీరెడ్డి నిర్మాతకు బెదిరింపు కాల్స్.. అంతు చూస్తామంటూ వార్నింగ్.. వివాదంలో బయోపిక్
వివాదాస్పద నటి శ్రీరెడ్డి జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రెడ్డీ డైరీ అనే చిత్రం తమిళంలో తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో శ్రీరెడ్డికి ఆఫర్లు చూపి వాడుకొని వదలేసిన కొందరి ప్రముఖులు జాతకాలను బయటపెట్టనున్నారనే వార్త తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ చిత్రానికి చెందిన డైరెక్టర్‌కు తాజాగా బెదిరింపులు రావడం వివాదంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

చెన్నైలో మకాం వేసిన శ్రీరెడ్డి
మీటూ ఉద్యమంతో దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించిన శ్రీరెడ్డి ఆ తర్వాత చల్లబడింది. అనూహ్యంగా తెలుగు పరిశ్రమను వీడి తమిళ పరిశ్రమలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేపట్టింది. చెన్నైలోనే ఉంటూ సోషల్ మీడియాలో ప్రముఖులను టార్గెట్ చేస్తున్నది.
తడిసిన అందాలతో సెగలు రేపుతోన్న సాక్షి అగర్వాల్ ఫొటోలు

తెలుగులో క్లైమాక్స్ చిత్రంలో
అయితే తాజాగా టాలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నించింది. క్లైమాక్స్ చిత్రంలో తన జీవితానికి దగ్గరగా ఉండే పాత్రను శ్రీరెడ్డి పోషించింది. అయితే ఆ సినిమాకు అంతగా ప్రేక్షకాదరణ లభించకపోవడంతో శ్రీరెడ్డి కెరీర్‌కు ఆ సినిమా పెద్దగా ఉపయోగపడలేకపోయింది.

శ్రీరెడ్డి బయోపిక్ నిర్మాతకు బెదిరింపులు
ఇదిలా ఉండగా, తన జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న రెడ్డీ డైరీ అనే చిత్రంపైనే శ్రీరెడ్డి ఆశలు పెట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. ఈ సినిమాపై ఇప్పుడిప్పుడే తమిళంలో బజ్ క్రియేట్ అవుతున్నది. ఈ క్రమంలో నిర్మాత రవి దేవన్‌కు బెదిరింపులు రావడం తమిళ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

రెడ్డీ డైరీస్ రిలీజ్‌పై వార్నింగ్
నిర్మాత రవి దేవన్ తెలిపిన ప్రకారం.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేసి బెదిరించారు. రెడ్డి డైరీ సినిమాను ఆపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బెదిరింపులకు పాల్పడ్డారు. నీవు సినిమాను ఎలా రిలీజ్ చేస్తావో మేము చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు అని తెలిపారు.

పోలీసులకు నిర్మాత రవి దేవన్ ఫిర్యాదు
రెడ్డి డైరీ సినిమాను అడ్డుకొనేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అయితే వారి బెదిరింపులకు లొంగేది లేదు. సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తాం అని నిర్మాత రవి దేవన్ పేర్కొన్నారు. తనకు వచ్చిన బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అలాగే టైటిల్ నాదే అంటున్న మరో సినిమా కంపెనీపై కూడా కంప్లయింట్ చేస్తామని నిర్మాత రవి దేవన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











