నువ్వు ఓకే అంటే సిద్ధమే, నాది చూపిస్తా... నీదీ చూస్తా: లారెన్స్‌కు శ్రీరెడ్డి కౌంటర్

By Bojja Kumar

Recommended Video

Sri Reddy Responds To Raghava Lawrence

డాన్స్ మాస్టర్, దర్శకుడు రాఘవ లారెన్స్ మీద శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ మీడియా ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అవకాశం ఇస్తానని చెప్పి సెక్సువల్‌గా వాడుకున్నాడని, ఈ విషయంలో తన వద్ద ప్రూఫ్స్ ఏమీ లేవని, అలాంటి సమయంలో నా బాడీలో కెమెరాలు పెట్టుకోవడం సాధ్యం కాదు కదా... అంటూ వ్యాఖ్యానించడం, దీనికి లారెన్స్ స్పందిస్తూ శ్రీరెడ్డిని చూస్తే జాలేస్తోందని, ఆమెలో టాలెంట్ ఉంటే నిరూపించుకోమనండి, నా సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ ఛాలెంజ్ చేయడం తెలిసిందే. లారెన్స్ ఛాలెంజ్‌పై శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు.

తెగే వరకు లాగక పోతే నీకే మంచిది

తెగే వరకు లాగక పోతే నీకే మంచిది

రాఘవ లారెన్స్ చేసిన కామెంట్లపై శ్రీరెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని తెగే వరకు లాగక పోతే నీకే మంచిది అంటూ తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా కౌంటర్ ఇచ్చింది.

 నష్టపోయేది నువ్వే

నష్టపోయేది నువ్వే

నేను ఇంటరాగేషన్లో కూర్చుంటే... చివరకు లాస్ అయ్యేది నువ్వే. ఈ విషయంలో నువ్వు కాస్త వెనకా ముందు చూసుకుని కామెంట్స్ చేస్తే మంచిది అని శ్రీరెడ్డి హెచ్చరించారు.

నీకు ఓకే అయితే నా టాలెంట్ చూపిస్తా, నీదీ చూస్తా

నీకు ఓకే అయితే నా టాలెంట్ చూపిస్తా, నీదీ చూస్తా

నీకు ఓకే అయితే నీ సినిమాలో మనం కలిసి నటిద్దాం. నాకుండే టాలెంట్ నాకు ఉంది, నీ టాలెంట్ ఏమిటో కూడా చూస్తాను.... అంటూ శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

మన కాంబినేషన్ అదిరిపోతుంది

మన కాంబినేషన్ అదిరిపోతుంది

మనం ఇద్దరం కలిసి నటిస్తే.... తెరపై మన కాంబినేషన్ అదిరిపోతుంది గురూ... అంటూ శ్రీరెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించడం గమనార్హం.

లారెన్స్ ఛాలెంజ్ చేయడం హాట్ టాపిక్

లారెన్స్ ఛాలెంజ్ చేయడం హాట్ టాపిక్

ఇప్పటి వరకు శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన వారిలో చాలా మంది రియాక్ట్ అవ్వడానికి ఇష్టపడలేదు. ఒక లారెన్స్ మాత్రమే ఆమె వ్యాఖ్యలపై రియాక్ట్ అవ్వడంతో పాటు.... నీలో టాలెంట్ ఉందని నా ముందు నిరూపించుకుంటే నీకు అవకాశంతో పాటు, అడ్వాన్స్ కూడా ఇస్తాను, నేను నీకు భయపడి ఈ మాట లనడం లేదు. స్త్రీలంటే గౌరవం కాబట్టే రియాక్ట్ అవుతున్నానంటూ ఆమెకు ఛాలెంజ్ చేయడం తమిళ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

శ్రీరెడ్డి కౌంటర్‌పై లారెన్స్ ఎలా స్పందిస్తారో

శ్రీరెడ్డి కౌంటర్‌పై లారెన్స్ ఎలా స్పందిస్తారో

మరి శ్రీరెడ్డి కౌంటర్ మీద లారెన్స్ ఎలా స్పందిస్తారు? ఆమెకు టాలెంట్ టెస్ట్ పెడతరా? ఒక వేళ ఆ టెస్టులో శ్రీరెడ్డి నెగ్గితే తన సినిమాలో అవాకశం ఇస్తారా? మున్ముందు ఈ ఇష్యూ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X