హాట్ టాపిక్‌గా శ్రీరెడ్డి వార్నింగ్, వాళ్ళు ఆరితేరిపోయారు.. నాతో పెట్టుకుంటే ఇక అంతే!

Recommended Video

Sri Reddy Gives Ex-Hortatory To Tamil Producers !

కాస్టింగ్ కౌచ్ పోరాటంతో బాగా పాపులర్ అయిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా మారుతోంది. చాలా రోజుల క్రితం శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి చేసిన అర్థనగ్న నిరసన, ఆపై పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించడం వంటి వివాదాస్పద సంఘటనలతో శ్రీరెడ్డి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అప్పటి నుంచి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ పెద్ద సెలెబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా తమిళ ప్రొడ్యూసర్స్ కి శ్రీరెడ్డి ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది.

తమిళ ప్రముఖులపై కూడా

తమిళ ప్రముఖులపై కూడా

టాలీవుడ్ సెలెబ్రిటీలపైనే కాదు. తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై కూడా శ్రీరెడ్డి ఆ మధ్యన ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమిళ మీడియాలో శ్రీరెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైరల్ గా మారాయి. హీరో, డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ తరువాత లారెన్స్ శ్రీరెడ్డిని స్వయంగా తన ఇంటికి పిలిచి తదుపరి చిత్రంలో అవకాశం ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

ఆరితేరిపోయారు

ఆరితేరిపోయారు


తమిళ నిర్మాతలపై శ్రీరెడ్డి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిర్మాతలుగా, నడిగర్ సంఘం సభ్యులుగా చాలా మంది మీడియాని మేనేజ్ చేస్తున్నారు. ఆ విషయంలో ఆరితేరిపోయి ఉన్నారు. కానీ మీ ఆటలు నా దగ్గర సాగవు. నాతో పెట్టుకుంటే మీకే ఇబ్బందులు అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

వివాదాస్పద ఇంటర్వ్యూలు

వివాదాస్పద ఇంటర్వ్యూలు

చాలా రోజులుగా శ్రీరెడ్డి తమిళ మీడియాలో ఇంటర్వ్యూలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతలు మీడియాతో ఏమైనా సంప్రదింపులు జరిపారా అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా శ్రీరెడ్డికి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.

బుల్లెట్ రైడింగ్


తదుపరి చిత్రంలో తనకు లారెన్స్ ఛాన్స్ ఇచ్చాడని శ్రీరెడ్డి స్వయంగా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి కొన్ని చిత్రాల్లో కూడా శ్రీరెడ్డి నటిస్తోంది. తన తదుపరి చిత్రం కోసం బుల్లెట్ రైడింగ్ నేర్చుకున్నానని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X