తమిళ లీక్స్: చెన్నై వెళుతున్న శ్రీరెడ్డి... రంగంలోకి విశాల్, ఏం జరుగబోతోంది?

By Bojja Kumar

Recommended Video

Sri Reddy Goes Moves Chennai To Nadigar Sangam

తమిళ లీక్స్ పేరుతో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఏఆర్ మురుగదాస్, రాఘవ లారెన్స్, సుందర్ సి, శ్రీకాంత్ లాంటి స్టార్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తనను మోసం చేసిన వారిపై కంప్లయింట్ చేసేందుకు చెన్నై వెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రీరెడ్డి చెన్నై వస్తున్న నేపథ్యంలో నడిగర్ సంఘం కార్యదర్శి హోదాలో ఉన్న నటుడు విశాల్ రంగంలోకి దిగారట. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది చర్చనీయాంశం అయింది.

 చెన్నై వెళుతున్నట్లు వెల్లడించిన శ్రీరెడ్డి

చెన్నై వెళుతున్నట్లు వెల్లడించిన శ్రీరెడ్డి

సోమవారం ఉదయం ఫేస్ బుక్ పేజీలో వీడియో పోస్టు చేసిన శ్రీరెడ్డి.... తాను చెన్నై వెళుతున్నట్లు తెలిపారు. అక్కడికి వెళ్లి కొన్ని పనులు చేయాల్సి ఉంది. అదే విధంగా నన్ను మోసం చేసిన వారిపై ఫిర్యాదు చేయాల్సి ఉంది... అని శ్రీరెడ్డి తెలిపారు.

టాలీవుడ్లో న్యాయం జరుగలేదు, కోలీవుడ్లో అయినా...

టాలీవుడ్లో న్యాయం జరుగలేదు, కోలీవుడ్లో అయినా...

నాకు టాలీవుడ్లో న్యాయం జరుగలేదు. కోలీవుడ్లో చాలా మంచి వ్యక్తులు ఉన్నారు, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. అక్కడ మహిళలకు మంచి గౌరవం ఉంటుంది. అక్కడైనా నాకు న్యాయం జరుగుతుందని వెళుతున్నాను. భవిష్యత్తులో నాకు సినిమా అవకాశాలు వస్తాయో? రావో నిజంగా నాకు తెలియదు. ఆ దేవుడికే తెలుసు. నాలాగా ఏ ఆడపిల్లా బాధపడకూడదనే ఇదంతా చేస్తున్నాను. నా జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకుని అయినా అమ్మాయిలు కళ్లు తెరవాలి... అని శ్రీరెడ్డి తెలిపారు.

విశాల్ న్యాయం చేస్తారని భావిస్తున్నా

విశాల్ న్యాయం చేస్తారని భావిస్తున్నా

నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ మీద నమ్మకం ఉంది. నాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. కానీ విశాల్ లాంటి పొజిషన్లో ఉన్న వారు మహిళలకు రక్షణగా ఉండాల్సిన అవసరం ఉంది, అందరితో పొలైట్ గా మాట్లాడాలి. కానీ ఆయన నా గురించి మాట్లాడుతూ... ఇదంతా నేను పబ్లిసిటీ కోసమే చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఆయన అలా అనడం దురదృష్టకరం.

 విశాల్ గారూ నేను పబ్లిసిటీ కోసం ఇదంతా చేయడం లేదు

విశాల్ గారూ నేను పబ్లిసిటీ కోసం ఇదంతా చేయడం లేదు

విశాల్ గారూ నేను పబ్లిసిటీ కోసం ఇదంతా చేయడం లేదు. పబ్లిసిటీ కోసమే నేను ఇదంతా చేస్తే ఇలా సఫర్ అయ్యేదాన్ని కాదు, నా జీవితం, క్యారెక్టర్ మీద ఇలా బ్లాక్ మార్క్ వేసుకునేదాన్ని కాదు. అలా చేయాలనుకుంటే ఒక వారం రోజులో, నెల రోజులో చేసుండేదాన్నేమో? అంతకంటే చేయలేం కదా. దీనికంటే ముందే నా ఇంటర్వ్యూలు ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేశాయి. పబ్లిసిటీ కోసమే అయితే ఇంతకు మించి నాకు ఏం కావాలి?... నాకు అన్యాయం జరిగింది కాబట్టే ఇదంతా చేస్తున్నాను, పబ్లిసిటీ కోసం కాదు అని శ్రీరెడ్డి తెలిపారు.

రంగంలోకి విశాల్...

రంగంలోకి విశాల్...

శ్రీరెడ్డి విషయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి రంగంలోకి దిగాలని విశాల్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ఎవరిపై అయితే శ్రీరెడ్డి ఆరోపణలు చేసిందో .. వాళ్లతో మాట్లాడిన తరువాత ప్రెస్ మీట్ పెట్టాలని విశాల్ భావిస్తున్నాడట. ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే దాన్ని వెంటనే సాల్వ్ చేసే ప్రయత్నం విశాల్ చేస్తుంటారు. మరి శ్రీరెడ్డి విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏం జరుగబోతోంది అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X