ఇక్కడ దారుణం... అక్కడ స్వర్గం: శ్రీరెడ్డి జీవితంలో సడెన్ టర్న్, ఈ ఫోటోలే సాక్ష్యం!

Recommended Video

Sri Reddy Enters Into Her New House

వివాదాస్పద నటిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి హైదరాబాద్‌లో ఉన్నపుడు ఎంతటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొందరు సినీ ప్రముఖులపై ఆమె చేసిన ఆరోపణలతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. అయితే శ్రీరెడ్డి మీద కొందరు నెగెటివ్ కాంపెయిన్ చేయడంతో ఆమె పర్సనల్‌గా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చివరకు ఆమెకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి కూడా ఇంటి ఓనర్లు భయపడే పరిస్థితి కల్పించారు. ఒకరకంగా చెప్పాలంటే హైదరాబాద్‌లో ఒకానొక సందర్భంలో దుర్బర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే శ్రీరెడ్డి జీవితం ఎవరూ ఊహించని మలుపు తిరిగింది.

శ్రీరెడ్డి జీవితంలో సడెన్ టర్న్

శ్రీరెడ్డి జీవితంలో సడెన్ టర్న్

హైదరాబాద్‌లో శ్రీరెడ్డి విషయంలో జరిగిన కొన్సి సంఘటనలు చూసి ఇక ఆమె సినిమా కెరీర్ ముగిసినట్లే అని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా చెన్నైకి షిప్ట్ అవ్వడంతో శ్రీరెడ్డి జీవితం ఊహించని మలుపు తిరిగింది.

తమిళంలో సినీ అవకాశాలు

తమిళంలో సినీ అవకాశాలు

చెన్నై వెళ్లి కొన్ని రోజుల పాటు అక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో సంచలనం క్రియేట్ చేసిన శ్రీరెడ్డి.... ఊహించని విధంగా అక్కడ సినిమా అవకాశాలు దక్కించుకుని వివాదాలకు పులిస్టాప్ పెట్టింది. ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

ఇపుడు స్వర్గంలో...

ఇపుడు స్వర్గంలో...

తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో కొన్ని ఫోటోలు పోస్టు చేసి నా కొత్త స్వర్గంలోకి అడుగు పెడుతున్నాను అంటూ పేర్కొన్నారు. చెన్నైలో ఆమె కొత్త ఇల్లు(బహుషా అద్దె ఇల్లు?) తీసుకున్నారు. ముందుగా ఇంట్లోకి పశువులను ప్రవేశ పెట్టి తర్వాత పాలు పొంగించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదే నా ప్రపంచం అంటూ...

ఇదే నా ప్రపంచం అంటూ...

చెన్నై నగరాన్ని ఈ లోకంలోనే గొప్ప నగరంగా పేర్కొన్న శ్రీరెడ్డి ఇక ఇదే నా ప్రపంచం అంటూ వ్యాఖ్యానించారు. శ్రీరెడ్డి జోరు చూస్తుంటే తమిళ ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యేలా కనిపిస్తోంది. అఫ్ కోర్స్ టాలీవుడ్లో చాలా మంది కోరుకుంటున్నది కూడా ఇదే!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X