నిజమా? శ్రీదేవి లిప్ లాక్, రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్?
హైదరాబాద్: ఒకప్పుడు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రసీమను తన అందం, అభినయంతో ఓ ఊపు ఊపి అతిలోక సుందరిగా కీర్తిగడించిన స్టార్ హీరోయిన్ శ్రీదేవి...నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లాడిన తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి దాదాపు 15 ఏళ్ల పాటు సినిమాలకు దూరమైంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లయినా మరో సినిమాలో ఇప్పటికీ నటించలేదు.
తాజాగా ఆమె తమిళ ఎపిక్ మూవీ ‘పులి'లో నటించడానికి ఓకే చెప్పింది. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 14వ శాతబ్దానికి చెందిన బ్యాక్ డ్రాపుతో సాగుతుంది. ఇందులో ఆమె మహారాణి పాత్రలో అనుష్క తల్లిగా నటిస్తోంది. తమిళ స్టార్ సుదీప్ ఈచిత్రంలో శ్రీదేవి భర్తగా నటిస్తున్నాడి, ఇద్దరి మధ్యలో ఓ లిప్ లాక్ సీన్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నట్లు ఈ సినిమాకు ఆమె రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కథానుగుణంగా సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఉండటం సహజమే. అయితే 51 ఏళ్ల వయసులో శ్రీదేవి ఈ సీన్ చేయడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ సీన్ హాట్ గా ఉండదని, కాస్త ఉద్వేగభరితంగా ఉండి కథలో కలిసి పోతుందని అంటున్నారు.
ఈచిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్స్. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. పీరియడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ వైవిధ్యమైన బాణీలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











