రూమరే అని దర్శకుడు తేల్చాడు

By Srikanya

చెన్నై : శ్రీదేవి నటిస్తోందంటే ఆ చిత్రానికి వచ్చే క్రేజ్ వేరే. అందుకే ఏదనేమో ఏదన్నా ప్రాజెక్టు ప్రారంభం అవుతోందంటే శ్రీదేవి నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రతీసారి ఆ విషయాన్ని దర్శక,నిర్మాతలు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ చిత్రంలో ఆమె నటించనుందంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడా చిత్రంలోనూ లేదని దర్శకుడు ఖరారు చేసి చెప్పారు.

వివరాల్లోకి వెళితే... మలయాళంలో వచ్చిన 'దృశ్యం' సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో ఆ సినిమా అన్ని దక్షిణాది భాషల్లో రీమేక్‌ అవుతోంది. తమిళం రీమేక్‌లో కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓ కీలక పాత్రలో శ్రీదేవి నటిస్తున్నట్టు వార్తలు రావడం. చాలారోజులుగా తమిళ 'దృశ్యం' సినిమాలో శ్రీదేవి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తోందని ప్రచారం జరిగింది. ఇక అలాంటి ప్రచారాలకు తెరపడింది. తమిళ 'దృశ్యం'లో శ్రీదేవి నటించట్లేదని చిత్ర దర్శకుడు జీతూజోసెఫ్‌ ప్రకటించాడు.

Sridevi not part of Tamil ‘Drishyam’

జీతూ జోసెఫ్ మాట్లాడుతూ..... 'మేమింకా నటీనటుల ఎంపిక పూర్తి చేయలేదు. అయినప్పటికీ ఈ సినిమాలో శ్రీదేవి నటించట్లేదు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులో కమల్‌హాసన్‌తో పాటు మలయాళ మాతృకలో నటించిన ఆశా శరత్‌ మాత్రమే కన్‌ఫర్మ్‌. మిగతా నటీనటులకు సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేస్తాం' అని చెప్పాడు.

మరో ప్రక్క ఈ చిత్రం నిర్మాణ ఏర్పాట్లులలో ఉండగా...కేరళలలోని ఎర్నాకులం జిల్లా కోర్టు ఆ రీమేక్ ని ఆపమని ఉత్తర్వులు ఇచ్చింది. దానికి కారణం....మళయాళి రచయిత సతీష్ పౌల్ రాసిన Oru Mazhakalathu కథ నుంచి కాపీ కొట్టి..దృశ్యం తీసారని కోర్టుకి ఎక్కటమే. 2013 మే నెలలో ఈ కథ పబ్లిష్ అయ్యింది. డిసెంబర్ 2013 లో మళయాళంలో మోహన్ లాల్ హీరోగా దృశ్యం విడుదలైంది.

ఈ కేసు విషయం తేలేవరకూ తమిళ రీమేక్ ని ఆపమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ రచయిత కి చెందిన అడ్వకేట్ మాట్లాడుతూ... 2009లో సతీష్ స్క్రిప్టు రాసి చాలా మంది నిర్మాతలను కలిసానని, అందులో దృశ్యం నిర్మాత ఆంటోని ఒకరని అన్నారు. అయితే ఆంటోని ఈ స్క్రిప్టు చేయటానికి ఆసక్తి చూపలేదు. అయితే మరో ఇద్దరు నిర్మాతలు మాత్రం కొత్తవాళ్లతో లో బడ్జెట్ లో ఈ చిత్రం ప్లాన్ చేసారు. వాళ్లు ఏప్రియల్ లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఈ లోగా కొంతమంది దృశ్యం స్టోరీలైన్ గురించి చెప్పి ఆపుచేయించారు.అప్పుడు దృశ్యం దర్శకుడు జీతూని కలిస్తే..దృశ్యం చిత్రం ఫ్యామిలీ డ్రామా అని అన్నారు. రిలీజయ్యాక చూస్తే పూర్తిగా సతీష్ చెప్పిన కథకు జెరాక్స్ కాపీ అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X