కమల్ హాట్ ఆఫర్, శ్రీదేవి ఒప్పుకుంటుందా?

By Bojja Kumar

హైదరాబాద్: దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత హీరోయిన్ శ్రీదేవి ఆ మధ్య బాలీవుడ్ మూవీ 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆమె తమిళంలో సినిమా చేసి దాదాపు 28 సంవత్సరాలయింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ముఖ్య పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తాజాగా శ్రీదేవికి మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మళయాలం, తెలుగులో హిట్ అయిన 'దృశ్యం' చిత్రాన్ని తమిళంలోనూ తెరకెక్కించబోతున్నారు. కమల్ హాసన్ హీరో. ఈచిత్రంలో ఓ ముఖ్య మైన పాత్రకు శ్రీదేవిని తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నారట. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రను శ్రీదేవితో చేయిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. అయితే దీనిపై శ్రీదేవి నుండి గ్రీన్ సిగ్నల్ అందాల్సి ఉంది.

ఇప్పటికే 'దృశ్యం' సినిమా స్టోరీలైన్ శ్రీదేవి భర్త బోనీ కపూర్ విన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే శ్రీదేవి ఈ చిత్రంలో నటిస్తుందా? లేదా? అనే విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

శ్రీదేవి-కమల్ హాసన్ సక్సెస్ ఫుల్ జోడీ

శ్రీదేవి-కమల్ హాసన్ సక్సెస్ ఫుల్ జోడీ


శ్రీదేవి, కమల్ హాసన్‌లకు సక్సెస్ ఫుల్ జోడీగా పేరుంది. 1970- 80ల్లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇద్దరూ కలిసి దాదాపు 15 చిత్రాల్లో కలిసి నటించారు.

చాలా కాలం తర్వాత...

చాలా కాలం తర్వాత...


తమిళ ‘దృశ్యం' సినిమాలో నటించడానికి శ్రీదేవి ఓకే చెబితే....చాలా కాలం తర్వాత కమల్ హాసన్, శ్రీదేవిని తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు లభించబోతోంది.

కమల్ హాసన్ భార్య పాత్రలో ఎవరు?

కమల్ హాసన్ భార్య పాత్రలో ఎవరు?


తమిళ ‘దృశ్యం'లో కమల్ హాసన్ భార్య పాత్రలో ఎవరు నటిస్తారు? అనే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మీనా, గౌతమి, అభిమామిలను ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నారు.

వచ్చే వారం నుండి షూటింగ్

వచ్చే వారం నుండి షూటింగ్


ఇటీవలే తమిళ ‘దృశ్యం' చిత్రం లాంచనంగా ప్రారంభం అయింది. ఆగస్టు మొదటి వారం నుండి షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X