తెలుగులో తమిళ హీరో శ్రీరామ్
తమిళంలో సక్సెస్ సాధించి, తెలుగులోకి రావడం ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. తెలుగువారైన శ్రీరామ్ (తమిళ రంగంలో శ్రీకాంత్‌గా పాపులర్), విశాల్ (పందెంకోడి ఫేమ్), రవికృష్ణ (7జి బృందావన్ కాలనీ ఫేమ్) వంటి వారు మొదట తమిళంలో ప్రూవ్ చేసుకుని తర్వాత తెలుగు మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా శ్రీరామ్ తెలుగు చిత్రాలను చేయడానికి సిద్ధమవుతున్నారు. అతను నటించిన ఒకటి రెండు చిత్రాలు డబ్బింగ్ అయి విడుదలైనా, తెలుగులో ఆయన చేసిన స్ట్రయిట్ చిత్రం ఒకరికొకరు యావరేజ్ చిత్రంగా మారడంతో శ్రీరామ్‌కు అవకాశాలు లేకపోయాయి. ఇప్పుడు ఆయన వెంకటేష్‌తో కలిసి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో నటించడానికి అంగీకరించారు.
అది కాకుండా, సోలో హీరోగా బజ్జూ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాంరెడ్డి (మనోడు ఫేమ్) దర్శకత్వంలో నటించడానికి శ్రీరామ్ అంగీకరించాడు. అక్టోబర్ నెలలో మొదలయ్యే ఈ చిత్రంలో శ్రీరామ్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తారు. ఇది పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని నిర్మాత ఎస్. కె. బషీద్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని కొత్త టెక్నాలజీతో, రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు నిర్మాత చెప్పారు.
ప్రస్తుతం నిర్మాత బషీద్ తొలి ప్రయత్నంగా వేణు, నరేశ్, పార్వతి మెల్టన్, మల్లికా కపూర్ ప్రధాన తారాగణంగా అల్లరే అల్లరి చిత్రాన్ని ముప్పలనేని శివ దర్శకత్వంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications