twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ తమిళ నటి ఎవరు, సస్పెన్స్‌లోకి నెట్టిన శ్రీరెడ్డి.. పోలీసు అంటూ షాకింగ్ న్యూస్!

    |

    Recommended Video

    Sri Reddy Press Meet In Chennai చెన్నై లో శ్రీ రెడ్డి ప్రెస్ మీట్

    మీడియా సంచలనం శ్రీరెడ్డి మరో ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. కాస్టింగ్ కౌచ్ చర్చతో మీడియాలో బాగా హైలైట్ అయిన శ్రీరెడ్డి టాలీవుడ్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అర్థ నగ్న నిరసనతో జాతీయ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ప్రముఖులపై తీవ్రమైన విమర్శలతో శ్రీరెడ్డి రెచ్చిపోయింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల నుంచి శ్రీరెడ్డి బయోపిక్ చిత్రం గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల విషయంలో శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది.

     రెడ్డి డైరీ

    రెడ్డి డైరీ

    తమిళంలో శ్రీరెడ్డి నటించబోతున్న చిత్రం రెడ్డి డైరీ. ఇటీవలే ఆ చిత్రం ప్రారంభమైంది. రెడ్డి డైరీ శ్రీరెడ్డి బయోపిక్ చిత్రం అని అంతా భావిస్తున్నారు. ఈ విషయంలో శ్రీరెడ్డి తాజాగా క్లారిటీ ఇచ్చింది. తాను నటించబోతోంది తన బయోపిక్ కాదట.

    ఎవరా తమిళ నటి

    ఎవరా తమిళ నటి

    రెడ్డి డైరీ చిత్రం ప్రముఖ తమిళ నటి జీవిత చరిత్ర గురించి అని శ్రీరెడ్డి సస్పెన్స్ లోకి నెట్టింది. ఆ నటి పేరు మాత్రం చెప్పలేదు. ఆ నటి పాత్రలో శ్రీరెడ్డి నటించడం లేదు. ఈ చిత్రం ఆమె ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా శ్రీరెడ్డి ప్రకటించింది.

     తన కథ కూడా

    తన కథ కూడా

    త్వరలో తన బయోపిక్ చిత్రం కూడా తెరకెక్కిస్తానని, దాని మీద ప్రస్తుతం వర్క్ జరుగుతోందని శ్రీరెడ్డి తెలిపింది. కాస్టింగ్ కౌచ్ పై చర్చ, అర్థ నగ్న నిరసనతో శ్రీరెడ్డి పేరు మారుమోగింది. ఇక ప్రముఖులపై శ్రీరెడ్డి దూషణలు, ఆరోపణలపై నెలల తరబడి మీడియాలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.

    తమిళ సినీప్రముఖులపై

    శ్రీరెడ్డి టాలీవుడ్ సెలెబ్రిటీలనే కాక, కోలీవుడ్ సెలెబ్రిటీలని కూడా టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి నటించబోయే రెడ్డి డైరీ చిత్రం గురించి నడిగర్ సంఘం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. రెడ్డి డైరీ తమిళంలోనే తెరకెక్కబోతోంది.

    English summary
    SriReddy gives clarity on Reddy Dairy movie. It is not about SriReddy life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X