Don't Miss!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. కార్తీ సార్ నేనేంటో చూపిస్తా, దడ పుట్టిస్తున్న తమిళ్ లీక్స్!
Recommended Video
మీడియా సంచలనం శ్రీరెడ్డి వివాదాలు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమకు అంటుకున్నాయి. శ్రీరెడ్డి తమిళ్ లీక్స్ మొదలు పెట్టడంతో కోలీవుడ్ ప్రముఖుల్లో అంతర్మధనం మొదలైనట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి ఇప్పటికే రాఘవ లారెన్స్, మురుగదాస్, సందీప్ కిషన్, త్రిష, నయనతార వంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లీక్స్ అంటూ చెన్నైలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. శ్రీరెడ్డి చిక్కులు నడిగర్ సంఘం వరకు చేరాయి.
పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలి
హీరో కార్తీ నడిగర్ సంఘం కోశాధికారిగా పని చేస్తున్నాడు. శ్రీరెడ్డి ఆరోపణల నేపథ్యంలో కార్తీకి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఇలా అనవసర రాద్ధాంతం చేస్తూ ఆరోపణలు చేయడం తగదని కార్తీ స్పందించాడు.
ఎంతో మంది చెబుతున్నా
మీడియా ఛానల్స్ లో కూర్చుని ఆరోపణలు చేస్తే ప్రయోజనం ఉండదని ఇదివరకే శ్రీరెడ్డికి బాబు గోగినేని లాంటివారు సలహా ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. దీనిపై శ్రీరెడ్డి కూడా ఘాటుగానే బదులిచ్చింది. బెడ్ రూమ్ లోకి కెమెరాలు పెట్టుకుంటామా అంటూ స్పందించింది.
కార్తీకి ఘాటు వార్నింగ్
తాజగా కార్తీ వ్యాఖ్యల గురించి కూడా శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. నేను నడిగర్ సంఘంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. కార్తీ సర్ మాటలు బాధించాయి. అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.
నేనేంటో చూపిస్తా
నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే నేనేంటో చూపించాల్సి వస్తుంది. లాజిక్కులు మాట్లాడొద్దు కార్తీ సార్ అంటూ కౌంటర్ఇచ్చింది. నడిగర్ సంఘం ఉన్నది సమస్యలు తీర్చడానికి.. ఉచిత సలహాలు ఇవ్వడానికి కాదు అంటూ శ్రీరెడ్డి కార్తీ పై ఫైర్ అయింది.
లీకుల పర్వం
తమిళ్ లీక్స్ అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలపై కోలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ వివాదాన్ని ఇంతటితో ఆపడానికి హీరో విశాల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి ఇంకెందరి పేర్లు బయట పెడుతుందో అనే అంతా చర్చించుకుంటున్నారు.