శృతి హరిహరన్ వాంగ్మూలం రికార్డ్ చేసిన కోర్టు.. అర్జున్ బయట పడడం కష్టమేనా!
Recommended Video

సీనియర్ హీరో అర్జున్ పై శృతి హరిహరన్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్రంగా మారుతున్నాయి. ఆరోపణలు చేయడమే కాదు అర్జున్ పై శృతి హరిహరన్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే అర్జున్ కూడా విచారణలో భాగంగా బెంగుళూరు లోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ హాజరయ్యారు లో హాజరయ్యారు. ఈ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఫలితంగా అర్జున్ తీవ్ర పరిణామాలు ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

శృతి హరిహరన్ వాంగ్మూలం
అర్జున్ విచారణ జరిగిన రెండు రోజుల తరువాత పోలీసులు శృతి హరిహరన్ ని పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు శృతి హరిహరన్ ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. అర్జున్ తో కలసి నటించిన చిత్రం ఏంటి, ఎలాంటి సందర్భంలో వేధింపులకు గురి చేసాడు, ఎలా వేధించాడు వంటి కీలక విషయాలని శృతి హరిహరన్ కోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది.

ఉత్కంఠగా మారిన కేసు
శృతి హరిహరన్ చెప్పిన విషయాలని కోర్టు విశ్వసిస్తే అర్జున్ కు చిక్కులు తప్పవు అని అంటున్నారు.లోతుగా దర్యాప్తు జరపాలని పోలీసులని ఆదేశించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంతవరకు పోలీసులు అర్జున్ ని అరెస్ట్ చేయలేదు. విచారణ నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

కర్ణాటక మహిళా కమిషన్
ఈ కేసులో కర్ణాటక మహిళా కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండడంతో తీవ్రంగా మారుతోంది. శృతి హరిహరన్ పోలీస్ స్టేషన్ లో మాత్రమే కేసు నమోదు చేసింది. కానీ మహిళా కమిషన్ మాత్రం ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. దీనితో శృతి హరిహరన్ కు బలం చేకూరినట్లు అయింది. అర్జున్ ని అరెస్ట్ చేయాలనీ మహిళా కమిషన్ బలంగా పట్టుబడుతోంది.

అసభ్యంగా ప్రవర్తించాడు
శృతి హరిహరన్ చేసిన ఆరోపణల ప్రకారం.. ఆ రోజు సెట్ లో ఓ డైలాగ్ చెప్పిన తరువాత శృతి హరిహరన్ ని అర్జున్ కౌగిలించుకోవాలి. ఆ సన్నివేశానికి ముందు ఇద్దరూ రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి హరిహరన్ ఆరోపిస్తోంది. కౌగిలించుకునే నెపంతో తన బ్రా, ఇతర ప్రయివేట్ భాగాలను ముట్టుకున్నాడని శృతి హరిహరన్ ఆరోపిస్తోంది.


Click it and Unblock the Notifications











