నయన్ మాజీ ప్రియుడితో శృతి హాసన్ రొమాంటిక్ వేషాలు?
కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ కాంట్రవర్సీ విషయాలకు చాలా దూరంగానే ఉంటుంది. ఒకవేళ తలదూర్చినా కూడా బయట వచ్చే కామెంట్స్ పై మాత్రం పెద్దగా స్పందించదని అందరికి తెలిసిన విషయమే. విమర్శలకు కూడా మొండిగా సమాధానం చెప్పగల సత్తా ఉన్న ఈ బ్యూటీ పేరు ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఆమె త్వరలోనే నయనతార మాజీ ప్రియుడైన శింబుతో ఒక రొమాంటిక్ సినిమా చేయనుందని కామెంట్స్ వస్తున్నాయి. విశాల్ తో డిటెక్టివ్ అనే ఇంట్రెస్టింగ్ మూవీని తెరకెక్కించిన యువ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో శృతి హాసన్, శింబు మెయిన్ లీడ్ లో కనిపించబోతున్నారాట. ఆ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఘాటుగా ఉంటాయని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇక శృతి హాసన్ ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ కి ఎక్కువగా గ్యాప్ ఇస్తోంది. తెలుగులో అయితే ఆమె సినిమా వచ్చి మూడేళ్లవుతోంది. చివరగా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాలో మాత్రమే కనిపించింది. ఆ మధ్య మంచి ఆఫర్స్ వచ్చినప్పుటికీ ఎందుకో చేయలేదు మరి. ఇక మొత్తానికి శృతి వకీల్ సాబ్, క్రాక్ సినిమాలాతో మళ్ళీ మూడేళ్ళ తరువాత తెలుగులో కాస్త బిజీ అవుతోంది. ఇక శింబుతో మరో తమిళ్ సినిమా చేయడానికో ఒప్పుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హీరోకు కూడా చాలా కాలంగా హిట్స్ లేవు. మరి శృతి హాసన్ కారణంగా సరైన సక్సెస్ అందుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











