తన గర్ల్ ప్రెండ్ కోసం శ్రుతి హాసన్ కి ట్విస్ట్ ఇచ్చాడు
చెన్నై: శ్రుతి హాసన్ వంటి స్టార్ హీరోయిన్ ని తమ సినిమాల్లో తీసుకోవటానికి దర్శకులు, హీరోలు ఉత్సాహం చూపెడుతూ ఉంటారు. అయితే ఆమె వద్దనే వాళ్లు ఉంటారా...అలాంటి సిట్యువేషన్స్ కూడా వస్తూంటాయి. మొదట ఒక హీరోయిన్ ని అనుకుని తర్వాత వారి ప్లేసులోకి రకరకాల కారణాలతో వేరే వారిని తీసుకురావటం ఇండస్ట్రీలో కామనే. అయితే శ్రుతి హాసన్ వంటి స్టార్ హీరోయిన్స్ ముందూ వెనకా ఆలోచిస్తారు. అయితే హీరోగారి రికమండేషన్ తో ఆమెను తప్పించి, లక్ష్మీ మీనన్ ని తీసుకోకతప్పలేదంటున్నారు.
వివరాల్లోకి వెళితే...విశాల్ హీరోగా హరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'పూజై'. ఈ సినిమా దీపావళికి తెరపైకి రానుంది. శ్రుతిహాసన్ హీరోయిన్. దీని తర్వాత సుశీంద్రన్ దర్శకత్వంలో విశాల్ నటించనున్నారు. ఇందులో కూడా శ్రుతిహాసన్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆమె స్థానంలో లక్ష్మీమీనన్‌ను తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ శ్రుతి హాసన్ ని రిపీట్ చేయటమెందుకుని దర్శకుడు వద్దన్నాడని కొందరంటూంటే అదేమీ కాదు..ఇది విశాల్ నిర్ణయమే అక్కడ వెబ్ మీడియా అంటోంది.

ఇలా చివరి నిముషాల్లో హీరోయిన్ ని మార్చటానికి కారణం విశాల్ నిర్ణయమే అంటున్నారు. గతంలో విశాల్ సరసన 'పాండియనాడు', 'నాన్ శివప్పు మనిదన్'లో నటించింది లక్ష్మీమీనన్. వాటిల్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో మళ్లీ లక్ష్మీమీనన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. 'పాండియనాడు'కు కూడా సుశీంద్రనే దర్శకత్వం వహించారు. మరోవైపు విశాల్, లక్ష్మీమీనన్‌ల మధ్య ప్రేమాయణం సాగుతోందని... అందుకే వరుసగా మూడు సినిమాల్లో అవకాశాలిచ్చారని కూడా రూమర్స్ తమిళ నాట వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











