»   »  అవ్వ!డ్రమ్స్ వాయించేవాడితో ?

అవ్వ!డ్రమ్స్ వాయించేవాడితో ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sruthi Kamal
ఇంకా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మొదటి సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ అప్పుడే ఆమెపై రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి. తాజాగా ఆమె జెర్రీ అనే డ్రమ్స్ వాయించే కుర్రాడితే ఎఫైర్స్ నడుపుతోందంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఆమెకో మ్యూజిక్ ట్రూప్ ఉంది. ఆ ట్రూప్ లో అతను పనిచేస్తూంటాడు. ఇక ఈ విషయమై తమిళ పరిశ్రమలో రకరకాలుగా చెప్పుకుంటున్నారు.


ఆమె ప్రస్తుతం నటిస్తున్న 'లక్' నిర్మాత ఈ ఎఫైర్ పై మండిపడుతున్నాడని సమాచారం. ఆమె ...ఆ మ్యూజిక్ ట్రూపుని ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి తెప్పించుకుంటోందని..మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికా షూటింగ్ కి వెళితే అక్కడికీ వాళ్ళని పిలిపించిందనీ..వారి ఖర్చులన్నీ నిర్మాతే భరించాలంటోందని అతను గొడవచేస్తున్నాడనేది టాక్. ఆయన అంతగా కావాలిస్తే జెర్రీ ని ఒక్కడినీ తెచ్చుకోమన్నాడనీ,ఆమె వినటం లేదనీ వాపోతున్నాడు.

ఇక ఇది ముదిరితే ఆమె తండ్రి కమల్ హాసన్ వద్దకు ఈ గొడవను తీసుకెళ్ళాల్సి వస్తుందనీ బెదిరించాడనీ అయినా ఆమె లెక్క చేయటం లేదని చెప్తున్నారు. ఇక ఇదే విషయాన్ని ఆమె ముందు తమిళ మీడియా పెడితే...జెర్రీ నేను ప్రెండ్స్ అన్నది నిజం...మిగతావన్నీ గాసిప్స్ అని తిట్టిపోస్తోంది.పరిశ్రమలోని వారు మాత్రం కమల్ కూతురుగా ఆమె పరువు పోగొట్టుతోందనీ...అయినా ఎవరూ దొరకనట్లు డ్రమ్స్ వాయించేవాడితో ఎఫైర్ ఏంటని విసుక్కుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X