twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి 22 కోట్ల బడ్జెట్ సినిమా పేరు...

    By Srikanya
    |

    రాజమౌళి 22 కోట్ల వ్యయంతో చేస్తున్న సినిమా టైటిల్ అంటూ తమిళ పత్రికల్లో వార్త వచ్చింది.ఏమిటా అది అంటే ఈగ సినిమా గురించి ఆ సినిమాకు అక్కడ 'నాన్ ఈ..' అనే టైటిల్ పెట్టారని రాసుకొచ్చింది.అలాగే అందులో హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో చేస్తున్న నాని అని,అతను అంతకుముందు చేసిన చిత్రం (సెగ)ఆడలేదని రాసింది. అలాగే సినిమాలో చాలా భాగం బ్లూ మ్యాట్ లో తీసారని, విజువల్ ఎఫెక్ట్స్ మొయిన్ గా సినిమా రూపొందుతోందని,తెలుగు సినిమాలు ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తున్నాయని రాసుకొచ్చింది.అలాగే హీరోయిన్ సమంత గురించి ఓ రేంజిలో ప్రస్దావించింది.ఆమె సినిమా తమిళంలో ఆడకపోయినా తెలుగులో స్టార్ అయ్యిందని,ఇప్పుడు గౌతమ్ మీనన్ చిత్రంతో ఆమె తమిళంలోనూ స్టార్ అవుతుందని,రాజమౌళి సినిమా ఆమెకు కలసి వచ్చే అంశమని ప్రస్తావించింది.

    సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది.సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.

    English summary
    SS Rajamouli is making the film Eega in Tamil and Telugu simultaneously. Tamil version of the movie has titled as Naan Ee.. The film is said to be made in Rs 22 Crs budget. Movie is mostly based on Visual Effects and most of it is being shot in Blue Mat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X