Thugs movie దర్శక ధీరుడు రాజమౌళి ఆశీస్సులతో.. పాన్ ఇండియా మూవీలో ప్రముఖ నిర్మాత కుమారుడు హీరోగా
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద గోపాల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న సినిమా థగ్స్. పులి, ఇంకొకడు, సామి 2, పలు హిందీ చిత్రాలు నిర్మించి, 30 కిపైగా చిత్రాలు పంపిణీ చేసిన టాప్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు HR పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం షిబు కుమారుడు హృదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్నారు.

శామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ అంథోని ఎడిటర్‌గా, జోసెఫ్, నెల్లికల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా థగ్స్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి క్యారెక్టర్స్ ఇంట్రడూసింగ్ వీడియోను చెన్నైలో ఆర్య, భగ్యరాజ్, గౌతమ్ మీనన్, పార్థిబన్, ఖుష్బూ, దేసింగ్, పూర్ణిమ భాగ్యరాజ్, కళా మాస్టర్ లాంటి ప్రముఖుల సమక్షంలో భారీ వేడుకలో విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.
మాస్టర్ మైండ్ సేతుగా హృదు, రోగ్ దురైగా సింహ, బ్రూట్ ఆరాకియా దాస్‌గా ఆర్ కే సురేష్, క్రుకెడ్ మరుదుగా మునిష్కాంత్ పరిచయం అయ్యారు ఈ వీడియో సినిమాపై భఆరీ అంచనాలను పెంచాయి. దర్శకధీరుడు SS రాజమౌళి వీడియో బైట్ ద్వారా హీరో హృదుకి, దర్శకురాలు బృందాకి తన బెస్ట్ విషెస్ అందజేశారు. థగ్స్ చిత్రం అన్ని భాషల్లో భారీ విజయం సాధించాలని కోరుకొన్నారు. నవంబర్‌లో తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











