twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాగినోడిని కంట్రోల్ చేసే దమ్ముందా?.. ప్రభుత్వాలకు స్టార్ హీరో పంచ్!

    |

    మొత్తానికి మద్యం అమ్మకాల జోరు పెరిగింది. రేటు పెరిగినా రద్దీ పెరిగినా తగ్గేది లేదని మందుబాబులు ఒక్కసారిగా వైన్ షాపులు ముందు ప్రత్యక్షమయ్యారు. రెడ్ జోన్లు, గ్రీన్ జోన్లు అని తేడా లేకుండా కొన్ని ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చేశారు. ఆదాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం అందరిని షాక్ కి గురి చేస్తోంది. దీంతో ప్రముఖులు ఈ విషయంపై సీరియస్ అవుతున్నారు. కమల్ హాసన్ కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

    ఎందుకిలా..

    ఎందుకిలా..

    వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్నపుడే కరోనాని అరికట్టేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని లాక్ డౌన్ ని కొనసాగించిన ప్రభుత్వాలు ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లోకి పెరుగుతుంటే సడలింపులు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ కఠిన చర్యలు తీసుకోక తప్పదని మద్యం షాపులకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి.

    కమల్ హసన్ సీరియస్..

    కమల్ హసన్ సీరియస్..

    స్టార్ హీరో కమల్ హసన్ మొదట తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నెల 7నుంచి అక్కడ కూడా మద్యం విక్రయాలు మొదలు కానుండడంతో జనాల ప్రాణాలతో ఆటలాడుతున్నారా అని సీరియస్ అయ్యారు. మద్యం దుకాణాలను ప్రారంభించడం వలన జరిగే నష్టాలే ఎక్కువగా ఉంటాయని ఈ మాత్రం ఆలోచన నాయకులకు ఎందుకు లేదని మండిపడ్డారు.

    పరిస్థితి విషమించితే..

    పరిస్థితి విషమించితే..

    ఎంత కష్టమైనా సరే దేశంలో ప్రజల ప్రాణాలకు భద్రత ఇవ్వాల్సింది పోయి మధ్య దుకాణాలను తెరచి కరోనా వైరస్ కి ఇంకా బలాన్ని చేకూరుస్తున్నారని కమల్ అన్నారు. అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితులను అదుపు చేయడానికీ కష్టంగా ఉన్న తరుణంలో మళ్ళీ పరిస్థితులను ప్రభుత్వాలే కఠినతరం చేయడం కరెక్ట్ కాదని అన్నారు. కరోనా మహమ్మారి ఇంకా విషమించితే అదుపు చేయడం కష్టమని తెలిపారు.

    Recommended Video

    Shruti Haasan Serious On Male Dominance In Industry || హీరోలు పై నుంచి ఊడిపడ్డారా?
    తాగినవాడిని కంట్రోల్ చేస్తారా?

    తాగినవాడిని కంట్రోల్ చేస్తారా?

    మద్యం షాపులు ఓపెన్ చేస్తే ఒక్కసారిగా జనాలు మద్యం కోసం ఎగబడుతుంటారు. తాగిన వ్యక్తిని కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుందా. వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్లకు కూడా ప్రమాదమే. ఏ ఒక్కరికి కరోనా ఉన్నా ఆ వైరస్ అక్కడ విలయతాండవం చేస్తుంది. దేశం మొత్తం మరింత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వాలు మద్యం దుకాణాలను తెరవకూడదని అన్నారు.

    English summary
    Star hero Kamal Hassan first expressed his displeasure over the decisions taken by the Tamil Nadu government. Since the sale of liquor from the 7th of this month to the start of the game, people are serious about whether the game is alive. The idea of ​​opening the liquor stores is much higher, but why the leaders are not thinking about it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X